పల్లవి:కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా (1)రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు (1)- ప్రార్థనకు చెవి యొగ్గుమా (2)
1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీదరాత్రిన్ ప్రియుడా (2) ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే (1) - ప్రియుల ప్రార్థన వినుమా (2)
2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు - మా ప్రియులు నశియించుట చూచి సహింపక కన్నీటితో చేయు - మా ప్రార్థన వినుమా
3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివే యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ - నా బీదమనవి వినుమా
4. శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంబౌనా? అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి - ఆ ప్రార్థన వినుమా
5. శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తుని అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి - ఆది ప్రార్థన వినుమా