CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 600

యెడతెగక ప్రార్థించుము

yedategaka praarthinchumu

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెడతెగక ప్రార్థించుము (2) - మెలకువతో కొనసాగుము (1)యెడతెగక ప్రార్థించుము (1)
1. క్రీస్తుని ఉపదేశమును పొంది (2) - ఆయన మాదిరి మదియందుంచి (2) ప్రార్థించుము - కౄతజ్ఞతతో (2) - ఆనంద గీతము పాడుచును (2)
2. ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడో గమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు
3. ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండి ఉపద్రవమందు పొందిన రక్షణ - కాపాడుకొనన్ నీ ఆత్మయందు
4. మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమని ప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను
5. విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొంద ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద
6. ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగా క్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు
7. నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తిని ఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై
8. మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతో సమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో

Back to Hebron Seeyonu Geethalu