CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 602

నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి

nenu taggaali yesu neeve hechaali

John 3:30

More
Reference recording on YouTube ↗
పల్లవి:నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి (2)నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి (2)ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము (2)
1. నేను యేసుతో కూడ - సిలువ వేయబడాలి - (2) నా స్వార్థ జీవితమంతా - లయమైపోవాలి - (2) యేసుని స్వభావమునాలో - అధికమౌతు ఉండాలి - (2) పరలోక జీవమునాలో అభివృద్ధి చెందాలి - (2)
2. ఆదాము పాపమునాలో - వశియించియుండగా యేసుని రక్తమోదాని - నశియింపచేయును ఆటంకమేమియు లేక - జీవధారలుండాలి యేసుని జీవమునాలో - నింపబడుతుపోవాలి
3. ప్రాచీన స్వభావమంత - సిలువ్ వేయబడాలి దాని ప్రభావమంత - లయమై పోవాలి అన్నిటిలో పాత స్వభావం - తొంగి తొంగి చూస్తుంది ప్రతిదినము యేసుప్రభువే - నాలో వృద్ధి చెందాలి
4. ఇహలోక కోరికలన్ని - సిలువవేయబడాలి ప్రభువైన యేసుకునాలో - ప్రథమ స్థానముండాలి శరీరేచ్ఛలన్ని మృతమై - ఆత్మీయతరావాలి ఆత్మీయ జీవము నాలో - అభివృద్ధి చెందాలి
5. లోకమంతయునాకై - సిలువ వేయబడాలి లోకముకై నేను కూడ - మృతమై పోవాలి కాదు లోకం యేసేనాలో - ఘనపరచబడాలి ఆశలన్నినావి యేసులో - దాగిపోయి ఉండాలి
6. నా శేష జీవితమంతా - యేసుకే సమర్పితమై ఆయన మహిమా స్వరూపం - పొంది మార్పు చెందాలి ఒకదినాన యేసుని రూపం - నాలో కనబడాలి మెట్టు మెట్టుకు ఆయన పోలిక - నాలో ఏర్పడాలి

Back to Hebron Seeyonu Geethalu