CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 609

అమూల్యరక్తము ద్వారా రక్షణపొందిన జనులారా

amoolyaraktamu dvaaraa rakshanapondina janulaaraa

Ephesians 2:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:అమూల్యరక్తము ద్వారా రక్షణపొందిన జనులారా (1)సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము (1)ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము (1)
1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి (2) చెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా (2)
2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
3. నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి
4. కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను
5. తన రక్తధారలలో - మన పాపములను కడిగి మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో
6. పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము
7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము - ఆత్మ ప్రాణ శరీరములన్

Back to Hebron Seeyonu Geethalu