పల్లవి:రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును (1)పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది (2)
1. మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో (2) తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను (2)
2. అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్
3. యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి
4. పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్ అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను
5. పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్ అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును
6. యేసుని సత్యములు - పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును
7. యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము