CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 62

యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు

yehovaye dayaadaakshinyamulu kaliginavaadu

Psalms 145:8-16

More
Reference recording on YouTube ↗
1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు
పల్లవి:యెహోవా అందరికిని మహోపకారుండుఆయన కనికరమాయన పనులపై నున్నది
2. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక || యెహో ||
3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు నీ శౌర్యమును గూర్చి నీ భక్తులు పల్కెదరు || యెహో ||
4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును || యెహో ||
5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును || యెహో ||
6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు || యెహో ||
7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు || యెహో ||

Back to Hebron Seeyonu Geethalu