పల్లవి:లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నది (2)
అను పల్లవి:యెహోవా మహిమ నీపై (2) - ప్రకాశముగా నుదయించె (2)
1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు (2) రాజులు నీదు ఉదయ (2) - కాంతికి వచ్చెదరు (2)
2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును
3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను
4. నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను
5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును