పల్లవి:తమ దేవునెరుగువారు చేసెదరు (1) - శక్తితో గొప్ప కార్యములు (2)
1. ఇచ్చకపు మాటలవలన (2) - అక్షయుని విడువరు (2) తప్పుబోధల నెపుడు తృణీకరించెదరు (2)
2. సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు
3. మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు
4. ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు
5. అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను సింహపు గుహలో వేసినను సిగ్గునొందరు
6. శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు
7. అదిక జ్ఞానమును పొంది - తగ్గించెకొనెదరు తామే యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు