పల్లవి:యెహోవా సైన్యములారాఆయన చిత్తమున్ నెరవేర్చు పరిచారకులారాఆయనను స్తుతించుడి మీరందరు స్తుతియించుడి
1. యెహోవా కృప నిధియని - మహోన్నతుండగు ప్రభువని యుగములనేలు మహరాజని - మహిమా స్వరూపిని పొగడి పాడుడి
2. కెరూబు సెరాపులన్నియు - పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువనుచు పరలోకమంతా ప్రతిధ్వనింప - పరిశుద్ధ ప్రియులారా ప్రణుతించి పాడుడి
3. మధుర గీతముతో ఆరాధించు - ప్రధానుడైనట్టి సుందర దూత మదియందు గర్వించి త్రోయబడగా - అధములు మనల అచ్చోట నుంచెను
4. తనదయా సంకల్పమును బట్టి - మనయందు తనదు క్రియను జేయ తన క్రీస్తునందు నిర్ణయించి - ముందుగా మనల ఏర్పరచుకొనెను
5. రక్షణ స్వాస్థ్యమొందునట్టి - అక్షయుల సేవింప ఆజ్ఞాపించె లక్షల దూతల సమూహములన్ - వీక్షించి గాయుచు వీరుల జేయును
6. క్షమియించు మనదు దోషములన్ - కుదుర్చు మనదు రోగంబులన్ సమాధి నుండి విమోచించి - కరుణా కిరీట ధారులు జేయును
7. ఘనత, మహిమ, ప్రభావమును - నిరతము చెల్లును దేవునికి గొట్టెపిల్లకు స్తోత్రమనుచు - పరమందు తన దాసులు కీర్తించి పాడుదురు