పల్లవి:దేవుని స్తుతియించుడి ! ఎల్లప్పుడు - దేవుని స్తుతియించుడి - ఆ ఆ (2)
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు (1) - ఆయన సన్నిధిలో - ఆ ఆ (2)
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు -ఆకాశ విశాలమందు
3. ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును
4. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వర మండలములతో
5. సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో
6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతో
7. పిల్లనగ్రోవుల చల్లగనూది - ఎల్లప్రజలు జేరి
8. మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో
9. సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్