CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 700

అనాది దేవుడు ఆశ్రయము

anaadi devudu aashrayamu

Deut 33:27

More
Reference recording on YouTube ↗
పల్లవి:అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే (2)
అను పల్లవి:నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు -మరణము వరకు మమ్ము నడిపించును (1) || అనాది ||
1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ (2) ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ (1)
2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్
3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును
4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు
5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్
6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు

Back to Hebron Seeyonu Geethalu