1. మమ్మున్ సృజించిన దేవుండు - ప్రాణము నొసంగి యెప్పుడు - కాపాడు మమ్మును సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
2. పలువిధాలుగా - బాధించు రోగముల్ పోఁగొట్టి మీదను - రాకుండఁజేసెను సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
3. దేవుండు మాత్రమే - రక్షణ మార్గము నాయత్తపరచి - చూపించె మాకును సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
4. మా నిత్యబాధలు - వారించుకొరకుఁ దా సొంత పుత్రుని - బంపెన్ సు ప్రేమతోసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
5. ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షము సర్వజనాళికి - ననుగ్రహించును సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్