పల్లవి:Prabhu nee vadanu neevu naa prabhudavani nee korakai jeevintunu (1)Migili na jeevitamunu nee korake gadipedanu (2)
1. ప్రభు వా యెరిగితిని లోకమంత మోసమని (2) చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో (2) కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను (1) నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును (2)
2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును నెమ్మదిని పొంది యిల - కన్నీరు కార్చనిక నీవే నా సర్వమని నీయందే బలపడెద
3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని నిన్ను నే నమ్మెదను - నీతోనే సాగెదను నీ రెక్కలచాటు నేనుండ భయపడను
4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు రక్షకుని చూచెదను - నన్నాయన చేర్చుకొనున్ తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను
5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను నే సంతసించెదను - ప్రభువుతోడ నుండెదను నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును