పల్లవి:ప్రభువైన క్రీస్తులో తండ్రి - ప్రేమతో నిచ్చె - పరలోక దీవెనలు - విరివిగను (1)ప్రభువైన క్రీస్తులో తండ్రి (1)
అను పల్లవి:తెరువబడె - ఆకాశము మనకై (2) || ప్రభు ||
1. నీతి యావత్తును నెరవేర్చ క్రీస్తు - బాప్తిస్మమొందిన క్షణమందే (2) తెరువబడిన ఆకాశము నుండి (2) - పరిశుద్ధ ఆత్మ దిగివచ్చె (1)
2. మనుష్య కుమారుడు మహిమను నొందగ - పరలోక వార్తలు వివరింప తెరువబడిన ఆకాశము నుండి - దూతలు ఎక్కుచు దిగుచుండె
3. దయ్యముల్ లోబడ సంతోషింపకు - నిజ సంతోషము ప్రభు తెలిపె తెరువబడిన పరలోకము నందు - వ్రాయబడెను మీ పేరులనే
4. పాటింపకు నర భేదము లేవి - ధీటైన సంఘమర్మమని తెరువబడిన ఆకాశము నుండి - పొందెను పేతురు దర్శనము
5. మేఘ ధనస్సున్న సింహాసనమున - తేజోమయుడై ప్రభువుండ తెరువబడిన పరలోకము నందు - యెహోవాను గాంచె పరవశుడై
6. లేదిక చీకటి దీప కాంతియు - ప్రబువే వారికి వెలుగాయె తెరుబడిన పరలోకమునందున - స్తుతి చెల్లింతురు పరిశుద్ధులు
7. నూతన సృష్టిలో నుండ నాశించిన - క్రీస్తులో తిరిగి జన్మించుము జయించు వానిగా నీవుండినచో - రాజ్యము చేతువు క్రీస్తునితో