పల్లవి:నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందువిను యేసుని స్వరమును - నీవు దేనిని వెదకుచున్నావు (1)
1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు (2) ఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావు (2) ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయును - చింతింతువు ఒకనాడు (2)
2. వెదకుము నీవు మొదట - దేవుని రాజ్యము నీతిన్ బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడె నూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందున - అంగీకరించుము నేడె
3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము ఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యం దుఃఖపడువారును - విరిగిన హృదయులందరును - శాంతి ఆనందం పొందెదరు
4. కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారు సమాధానపరచువారు - తన పుత్రులవుదురు హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్ - ఆ రాజ్యములో నుందురు