పల్లవి:నీ మందిరమునందు - నివసించువారు ధన్యులు, ధన్యులునీ ... వలన బలమొందువారు - ధన్యులు ధన్యులు (2)
1. యెహోవా, నీయందు - నమ్మికగలవారె ధన్యులు నీ ధర్మశాస్త్రమునందానందం - గలవారె ధన్యులు (2)
2. నీతికొరకు ఆకలి దప్పుల్ - కలిగినవారె ధన్యులు ఆత్మ విషయంబై దీనులుగా నున్న - వారె ధన్యులు
3. హృదయశుద్ధి, కనికరము - కలిగియున్నవారె ధన్యులు సాత్వీకులు, సమాధానపరచు - వారె ధన్యులు
4. క్రీస్తు కొరకు శ్రమనొందుచు - నిందింపబడువారె ధన్యులు మీ మీద, చెడు మాటలు - పలుకునప్పుడె ధన్యులు
5. క్రీస్తు నిమిత్తం, దరిద్రులై - ఆకలిగొనువారె ధన్యులు సంతోషించి, స్తుతించినచో - పరలోకంలో ధన్యులు
6. సత్యం కలిగి వాక్యంచదివి - ధ్యానించేవారే ధన్యులు వ్రాయబడిన వాక్యంవిన - గైకొనువారె ధన్యులు
7. పరలోకంలో చేరుటకు - రక్షణగలవారె ధన్యులు ప్రభుయేసుక్రీస్తు నందు మృతినొందు - వారందరును ధన్యులు"
8. చూచి నమ్మువారికంటె - చూడక నమ్మువారె ధన్యులు ప్రియ సోదర, ప్రియ సోదరి - నిరీక్షణ నుంచుము