పల్లవి:నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - నీవు పడ్డ సిల్వకున్నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - గాయ పడ్డ ప్రక్కకున్
1. నే నీవాడనై యుండగోరెదన్ - యేసు ప్రియ రక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ - నన్ను జేర్చు నీదరిన్
2. నన్ను బ్రతిష్ఠబర్చుమీ నాథా - నీదు కృపవల్లనే నాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్ - నీ చిత్తంబు నాకగున్ || నన్ను ||
3. నీదు సన్నిధిలో నికనుండ - నెంత తుష్ఠి నాకగున్ స్నేహితునిగ మాటలాడుదున్ - సర్వ శక్తి ప్రభుతో || నన్ను ||
4. నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహబుద్ధికందదు పరమందున దాని శ్రేష్ఠత - నే - ననుభవించెదన్ || నన్ను ||