CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 780

హల్లెలూయ హోసన్నాస్తుతి

hallelooya hosannaastuti

Philippians 3:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే (1)
1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును (2) నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా (2)
2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా
3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి
4. వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి

Back to Hebron Seeyonu Geethalu