పల్లవి:మహాదేవుడ వీవే (2) సర్వదర్శి - సర్వజ్ఞాని (2)సర్వవ్యాపి- యేసు నీవే (2)
1. నీదు కార్యముల్ అద్భుతముల్ - గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది - సర్వ సృష్టికి కర్తవు నీవే (నీవే సర్వమందు ఉన్నవాడవు - 2)
2. గత దినములు స్మరియించగా - గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి - దయా కిరీటము మాకిచ్చితివి (మమ్ము ఆనందింపజేసితివి )
3. విడచితిమి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘ క్రమమును లెక్కచేయక - ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను బాపుము - (మమ్ము క్షమించి, సరిచేయుము)
4. రానున్న దినములలో - స్థిరముగా నుండ దయచూపుము నన్ను నీకే అర్పించుకొందున్ - నీదు మాటకు లోబడెదన్ (నేడే నాతో మాట్లాడుము )
5. మహా మహిమతో వచ్చెదవు - లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదన్, (నిన్నే బహుమానముగా పొందెదన్ )