CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 859

ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము

prabhu yesukreestu aishvaryamu

More
పల్లవి:ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము - శోధింప శక్యముగానిదియుగ యుగముల నుండి - తరతరములనుండి - (2)మరుగైయున్నట్టి మర్మము - (2)
1. దేవుని కృపామహాదైశ్వర్యమే - పాపక్షమాపణ మనకిచ్చెను ఆయన దయాసంకల్పమే - మనలను స్వాస్థ్యముగా చేసెను హల్లెలూయా - హల్లెలూయా- హల్లెలూయా - హల్లెలూయా
2. ఐశ్వర్య వంతుడు మనయేసు - దరిద్రుడాయెను మనకొరకే రిక్తునిగా తన్ను చేసికొనన్ - పరమును వీడి నరుడాయెను హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
3. అల్పులము మనలను ప్రేమించెను - సంఘములో అంగములగాజేసెను నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది - వివరింప మాకు బుద్ధిచాలదే హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
4. ఒక్కప్రభువే అందరికి ప్రభువై - తనను ప్రార్ధించు వారందరికీ యూదులని గ్రీకులని భేదములేక - ఐశ్వర్యవంతుడు కృపచూపను హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
5. దరిద్రులముగా నెంచబడితిమి - లోకమునకైశ్వర్యమిచ్చు చుంటిమి యేమియులేని వారమైనను - సమస్తమును కలిగియున్న వారము హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
6. చిక్కులన్ని తొలగించి దరిచేర్చి - ఒక్కటిగా సంఘమును సమకూర్చి దిక్కుగా నుండి కాపాడుచుంటివి - మ్రొక్కుబడి చెల్లించి ఆరాధింతుము హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
7. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు - ఐశ్వర్యజ్ఞాన బలములాయనకే మహిమ ఘనత స్తుతిస్తోత్రముల్ - యుగయుగములాయనకే హల్లెలూయ హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

Back to Hebron Seeyonu Geethalu