CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 106

ఆనంద మహానందం

aananda mahaanandam

యోహాను 15 : 11 “మీయందు నా సంతోషము.....పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”

More
పల్లవి:ఆనంద మహానందం ప్రభువే మనకానందం  (1)మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం  (2)
చరణం 1:దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందము (2) కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే (2)
చరణం 2:ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్ గొఱ్ఱె పిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని
చరణం 3:నీ సన్నిధియందే కలవు నిత్య సంతోషములు నీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా
చరణం 4:ఇదివరకును మీరేమియును అడుగ లేదు నన్ను మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను
చరణం 5:యెహోవా విమోచించిన వారె పాటలు పాడి శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు
చరణం 6:ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులము తన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల
చరణం 7:ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయ పాడెదరు