పల్లవి:యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను (1)నీదు దాసుడనై నిన్నే నిన్నే నిన్నే వెంబడించెదను (2)
చరణం 1:యేసు నన్ను రక్షించి - నా కొరకు రానైయుండ (2)
నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను (2)
చరణం 2:నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే
ద్రోహంబు చేయక చక్కగ చక్కగ వెంబడించెదను
చరణం 3:మరణంబు గెల్చిలేచెన్ - మృత్యుంజయండై యేసు
నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను
చరణం 4:నే నేసు స్వామికి సాక్షిన్ - నా సాక్ష్యమిట్లుండగను
నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను
చరణం 5:యేసు నా జీవాదాతా - నా రక్షకా నా ప్రభువా
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను