CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 117

పాపిని నేను తప్పితి

paapini nenu tappiti

మత్తయి 14 : 31 “ప్రభువా నన్ను రక్షింపుము”

More
పల్లవి:పాపిని నేను తప్పితి భువిలో - రక్షించెడి వారెవరు (1)ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని (2)
చరణం 1:ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి దౌర్భాగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను
చరణం 2:జీవము నివ్వ వచ్చితివి - చచ్చి యుంటి నేను బంధింపబడితిని మరణ బంధముతో - విడిపించెడి వారెవరు
చరణం 3:జన్మముతోనే అపవిత్రుడను - నా స్వభావమే పాపం క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని
చరణం 4:స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్య కార్యములు ఆచారములతో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు
చరణం 5:భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై
చరణం 6:ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చు చున్నాను నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణకర్తవీవె