CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 130

జీవిత మేమెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి

jeevita memevvariki, nee jeevita mevvariki

లూకా 12 : 20 "నీవు సిద్ధపరచినవి యెవనివగునని అతనితో చెప్పనూ"

More
పల్లవి:జీవిత మేమెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి ?ఈ లోకములో జీవించు జీవితమంతజీవితమెవ్వరిది, నీ జీవితమెవ్వరికి? (1)
చరణం 1:శరీరేచ్ఛల పై ఆశలుండు (1) - ఈ ధరణియందు (2) సుఖభోగులుగా జీవింతురు (1) - ఈ ధరణియందు (2) వారి యూహలు దినమెల్ల చెడియున్నవి (2) వారి పాప జీవితమంత శాపమెగ (2)
చరణం 2:ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు వారి కలవరమంత ధనము ధనమే వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే
చరణం 3:స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు వారి మనసులు సంకుచితములై యుండు వారి జీవిత ప్రయాసము - పతనమేగా
చరణం 4:విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు వారు ప్రభుకై దాగియే నిలచెదరు దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు