పల్లవి:యేసుప్రభువే - నీకు రక్షణనిచ్చునుఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు
చరణం 1:మృతియే పాపపు జీతము - ప్రభుని వరము జీవము (2)
క్రీస్తు నoగీకరించిన - నిత్యజీవ మిచ్చును (2)
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా (2)
మరతువా యేసుని ప్రేమను - మరువకు (2)
చరణం 2:కంటికి కనబడనివెన్నో - చెవికి వినబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి - నీకై సిద్ధపరచెను
ప్రాణమున్ ఆ సిలువ పైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ బెట్టకు యేసుని - మాటను
చరణం 3:మరణబలము గలవానిన్ - నాశంబు చేసెను
మరణభయములో నున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువ పైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును - చేర్చుకో
చరణం 4:సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడినిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే
చరణం 5:దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడినిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే
చరణం 6:దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిది నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును - పొందను
చరణం 7:పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
ధరించుకొను సమూహము - ఖర్జూరమట్టలు చేబూని
దేవునికిని గొర్రెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడుము - హల్లెలూ