CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 202

మహాదేవుండు

mahaadevundu

More
పల్లవి:మహాదేవుండు - పరిశుద్ధుడగు తనయుని (2)అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము (2)
చరణం 1:పై నున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక (2) క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై (2) పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము (2)
చరణం 2:నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై పైనున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
చరణం 3:లోకాన నరభేదము పాటింపక - పరలోక దేవుని సేవించుము క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై పైనున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
చరణం 4:సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము సమస్తమాయన పేరట చేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము