పల్లవి:యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ (2)
చరణం 1:మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ (2)
చరణం 2:పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను
చరణం 3:నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
చరణం 4:చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసముగ నుందున్