CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 56

సిలువయే నీ గురిగా- నడువు యౌవనుడా

siluvaye nee gurigaa- naduvu yauvanudaa

మత్తయి 14:28 "పేతురు - ప్రభువా, నీవే అయితే నీళ్ళమీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.”

More
పల్లవి:సిలువయే నీ గురిగా- నడువు యౌవనుడా (1)వెనుకంజ వేయకయే-నిలువు యేసు బండపై (2)
చరణం 1:మునుగు చుండె నీ జీవ నావ దాటించు వారెవ్వరు? (2) యేసు ప్రభుండె దాటించువాడు (2) నీదు చుక్కాని యేసే (2)
చరణం 2:వచ్చెను యేసు ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ అక్షయుడు తెరచె నిశ్చయముగ మోక్షద్వారము నీకే
చరణం 3:సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వసించిన ముక్తిని పొందెదవు
చరణం 4:ప్రేమవార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లములకుప్రియమైన యేసే శాంతినిచ్చెడి రాజు