పల్లవి:యువతి యువక - ప్రభున్ జేరుమా దుర్దినములు -రాకముందే . (2 సార్లు)
చరణం 1:లేత వయస్సు - నడి ప్రాయము - గతియించి పోవున్ - గుర్తుంచుకో (2)
గతియించని - క్రీస్తున్ చేరు (2)
దుర్దినములు - రాకముందే
చరణం 2:నీ ఎదుట సరిగా - కనబడు మార్గం
ఆ మార్గమే మరణమునకు - నిను చేర్చును
జీవమార్గం - కోరుకొనుమా
దుర్దినములు - రాకముందే
చరణం 3:శరీర క్రియలను - విడిచి పెట్టి - క్రీస్తు ప్రభువును - ఆశ్రయించు
ఆత్మ ఫలముల్ - ఫలియించుమా
దుర్దినములు - రాకముందే