CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 67

తలుపులు తెరచియుండగనే

talupulu terachiyundagane

యోహాను 9 : 14 "రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పనిచేయలేదు"

More
పల్లవి:తలుపులు తెరచియుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా? (2) కాలమపాయముగా నుండె సమయము సద్వినియోగించు (2)
చరణం 1:చీకటి కాలము వచ్చుచుండె- కృపకాలము నుపయోగించు (2) తలుపులు తెరచియుండగనే -విరిగిన మనస్సుతో సాగెదవా? (2)
చరణం 2:భీడు భూము లధికముగా- చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు- ప్రేమావార్తను చాటించు || తలుపు ||
చరణం 3:ఎన్నో రాజ్యము లీనాడు- దేవుని పనికి మూయబడే తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు || తలుపు ||
చరణం 4:విశ్వాసుల సహవాసమున- ప్రేమా ఐక్యత గలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను || తలుపు ||
చరణం 5:రానైయున్న బాధ్యతలు -మనకధికము ప్రియులారా మనకు జయము కలుగటకై-వినయమున పోరాడెదము || తలుపు ||
చరణం 6:మాదు హృదయముల నింపు- నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో- నాథా నిన్నే చాటెదము || తలుపు ||