పల్లవి:ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడాపదిలముగా జీవించవా? (2)
చరణం 1:ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివై యుండ (2)
ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో
పావన వస్త్రముల నిచ్చెన్ (2)
చరణం 2:శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె
అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా
హతసాక్షిగా నీ వుండెదవా?
చరణం 3:ప్రభు యడుగుజాడలను పరికించి
ప్రభుకనుకూలంబుగా నడచినచో
హనోకువలె ఆ రెండవ మరణము
నొందక ప్రభుతో నుండెదవు
చరణం 4:పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభు సర్వాంగ కవచమున్ కల్గి
నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి
ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్
చరణం 5:మృతులను సహలేపు మహాత్ముడని
తన సుతునర్పించే నబ్రాహాము
మృతికి లోనగు నీ శరీరంబును
అతనికె బలిగానర్పించు
చరణం 6:తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు
మౌనమున్ జూపి మరణము గోరె
కడు శ్రమకాలములో ఖండించే ఖడ్గము
ముంగిట నీవట్లుండెదవా?
చరణం 7:యెహోవా భయము నొంది యోసేపు
ఎంత వైభవ మనుభవించెనోగాంచు
నీ జీవితంబులో దైవభయము నొంది
అక్షయ కిరీటమున్ బొందు