పల్లవి:యెహోవా నా బలమా - యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (1)
చరణం 1:నా శత్రువులు - నను చుట్టినను - నరకపు
పాశము లరికట్టినను (2)
వరదవలె భక్తిహీనులు-పొర్లిన (2) విడువక నను యెడబాయని దేవా (2)
చరణం 2:మరణపుటురులలో - మరువక మొరలిడ- ఉన్నత దుర్గమై - రక్షణ శృంగమై
తన ఆలయములో - నా మొర వినెను
అదిరెను ధరణి భయకంపముచే
చరణం 3:పౌరుషము గల - ప్రభు కోపింపగా - పర్వతముల పునాదులు వణీకెను
తన నోట నుండి - వచ్చిన యగ్ని
దహించివేసెను వైరుల నెల్లన్
చరణం 4:మేఘములపై- ఆయన వచ్చును-మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల-మెండుగ జేసి
అపజయ మిచ్చును అపవాదికిని
చరణం 5:దయగల వారిపై-దయ జూపించును-కఠినుల యెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క-గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి
చరణం 6:నా దీపమును - వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును
జలరాసుల నుండి-బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు
చరణం 7:నా కాళ్లను లేడి - కాళ్లగ జేసి - ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి
రక్షణ కేడెము-నా కందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన
చరణం 8:యెహోవా జీవము గల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ వీవు
అన్య జనులలో-ధన్యత జూపుచు
హల్లెలూయా స్తుతిగానము జేసెద