CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

Fellowship vision

And They Continued Steadfastly…

Principles governing the New Testament Church as revealed to Brother Bakht Singh.

Settings
Download PDF
About this edition · D. R. Devadoss

THE ORIGINAL EDITION

D. R. Devadoss

Telugu
2012–2014
31 pages

View original PDF

Page numbers below correspond to the original PDF. The original is preserved for reference.

ALSO IN

EnglishTamil
Back to the library

Page 01

వీరు.... ఎడతెగక యుండిరి

అపొస్తలుల కార్యములు 2:42

డి.ఆర్. దేవదాసు

(చెన్నైలోని యెహోవాషమ్మాలో ‘పెద్ద’గా నుండిన సహో.ఆర్.పి. దొరై రాజ్ గారు తెల్పిన విధము)

సహో. భక్తిసింగ్‌ గారికి ప్రత్యక్ష పరచబడిన

క్రొత్త నిబంధన సంఘమును నిర్దేశించు

నియమములు

Page 02

2 తొలి పలుకు కాబట్టి సహోదరులారా! నిలకడగా ఉండి, మా నోటి మాటవలనైనను, మా పత్రికవలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. (2 థెస్సలోనీకయులకు £2:15) అపొస్తలుడైన పౌలు, థెస్సలోనీక సంఘమునకు సేవ చేయుచు క్రీస్తు నందు ఏర్పరచబడి ఆయన మహిమను పొందుటకు పిలువబడిన వారికి తెలియచేసినట్లుగా మన దినములలో ప్రభువు నందు నిద్రించిన సహోదరుడు భక్తిసింగ్‌గారు గత అరువది సంవత్సరములలో బోధించిన సత్యమును విధులను ఈ పుస్తకము వివరించుచున్నది. కావున ఈ తరమునకు చెందిన మనము ఆయన మహిమ సంఘముగా సిద్ధపడుటకు, యేసుక్రీస్తునకు అంగీకారమైన సేవ చేయుటకు, వాటి యందు స్థిరముగా నిలుచుటకై ఈ పుస్తకము ప్రార్థనాపూర్వముగా ప్రచురించబడినది.

హాబ్రోను హైదరాబాద్‌ సహోదరుడు కె. ఫిలిప్పు

Page 03

3 ఉపోద్ద్హాతము ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను - నేను నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు. మత్తయి 16:18 ఈ కార్యము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41-42 వచనాలలో ప్రారంభమైనది. (అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును, ఎడతెగక యుండిరి. పరిశుద్ధాత్మ శిష్యుల మీదికి వచ్చినపుడు వారు సువార్త ప్రకటింపనారంభించిరి. అపొ. కార్య: 2:36-40 : (మీరు సిలువ వేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని - సహోదరులారా, మేమేమిచేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు - మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణనిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ధులగు ఈ తరము వారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను) అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి. అపొ. కార్య : 2:41 ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి సంఘము. సంఘముగా వారి జీవితములలో ఏదైతే జరిగిస్తూ వచ్చారో అదే భావితరాలకు మాదిరిగా ఉంచబడింది. వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అపొ. కార్య 2:42

Page 04

డే

ఈ నాలుగు పదములు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అను వాటి వెనుక లోతైన సూత్రములున్నవి. మొదటి శతాబ్ద సంఘము ఈ నియమములలో ఎడతెగక యుండిరి. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందినవారై ఆనందముతోను, నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణపొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపో. కార్య: 2:46-47

ప్రారంభ సంఘము ఈ నమూనాలో కొంతకాలము కొనసాగగా కార్యము దినదినాభివృద్ధి నొందెను. పిమ్మట అనేక సంఘములు ఐరోపాలోని అనేక (ప్రాంతములలో స్థాపించబడెను. రోమా పట్టణము సంఘమునకు కేంద్ర స్థలమాయెను. కొన్ని సంవత్సరముల తర్వాత కాన్‌స్టాంటైన్‌ అనునతడు రోమా చక్రవర్తి ఆయెను. అతడు ఇతర దేశములతో యుద్ధము చేయుచుండెను. ఈ దినములలో కలలో సిలువ దర్శనము పొందెను. అప్పుడతడు నేను జయించినచో కైస్తవుడనగుదు ననుకొనెను. అతడు యుద్ధము గెలిచి మతము మార్చుకొనెను. కాని తిరిగి జన్మించలేదు. అతడు అన్యుడు. అతడు మతము మార్చుకొని విగ్రహారాధన మానివేసెను. చక్రవర్తి మెప్పుగోరి అతని క్రింద పనిచేయుచున్న అన్యులు అనేకులు (విగ్రహారాధకులు) కైస్తవులైరి. అయితే విగ్రహములులేని ఆరాధన వారికి తృప్తి కలిగించలేదు. కావున ఏదైనా ఏర్పాటు చేయుమని చక్రవర్తినడిగిరి. బదులుగా చక్రవర్తి సమాజమును తృప్తి పరుచుటకై క్రీస్తు నామమున కొన్ని విగ్రహము లుంచుమని రోమా సంఘ అధ్యక్షుని (బిషప్‌) మనవి చేసెను. ఈ రీతిగా సంఘములోనికి విగ్రహములు తీసుకురాబడినవి. క్రీస్తు యేసు సిలువ దృశ్యము, క్రీస్తు యేసు పరిశుద్ధ హృదయము మొదలగునవి. అదే విధంగా అన్య ఆచారములు, పద్ధతులు సంఘములో ప్రవేశించినవి. సంఘ అధ్యక్షుడు (బిషప్‌) సర్వాధికారియై యుండెను. ఈ రీతిగా రోమన్‌ కెథోలిసిజమ్‌ ప్రారంభమై, నిజ సంఘము అంతర్జానమాయెను. అయితే వారు రొట్టె విరుచుటలో కొనసాగుచూ దానిని ప్రభు రాత్రి భోజనము అని పేరు పెట్టిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట మార్జిన్‌ లూథర్‌ అను క్యాథలిక్‌ పూజారి రోమన్‌ క్యాథలిక్‌

Page 05

ర్‌

నియమావలి నెదురించెను. అనేకులతని వెంబడించి రోమన్‌ క్యాథలిజమ్‌ నుండి ప్రత్యేకించుకొనిరి. జాన్‌ వెస్లీ వంటి అనేకులు వెంబడించి రోమన్‌ క్యాథలిజమ్‌ నుండి ప్రత్యేకించుకొనిరి. జాన్‌ వెస్లీ వంటి అనేకులు వెలుపలికి వచ్చి సైద్ధాంతిక సంఘముల నారంభించిరి. అయితే వారు క్యాటికిసమ్‌ (ప్రశ్నోత్తరములు) మొదలగు క్యాథలిక్‌ పద్ధతులననుసరించియే ఆరాధించిరి. అయితే తన సంఘముకై దేవుని నిత్య సంకల్పము నెరవేరవలసి యుండెను. కనుక దేవుడు తన దాసుడగు సహో భక్తిసింగ్‌ నేర్చరచుకొని, తన పరిచర్య కొరకైన తర్బీదు నిచ్చి, ప్రత్యక్షత ద్వారా సంఘము యొక్క నిజ నమూనాను చూపెను. (ఆరంభ సంఘపు నమూనా) నేను 1954వ సంవత్సరములో తిరిగి జన్మించి 1955 వ సంవత్సరము నుండి సహో భక్తిసింగ్‌ గారి సహవాసములో ఉన్నాను. నేను సి.యస్‌.ఐ. సంఘము నుంచి వచ్చిన వాడను. కావున ఇతర సహవాసములతో సరిపోల్చితే, మన సహవాసములో ఎందుకు సంఘ ఆరాధనా క్రమము భిన్నంగా యున్నదో తెలిసికొనవలెనను కోర్కె నాలో యుండింది. ఒక దినము ఈ విషయము సహో భక్తిసింగ్‌ గారి నడుగగా ఆయన నిర్ణమ 25:40 చదువమన్నాడు. “దేవుడు మోషేకు ప్రత్యక్షపు గుడారపు నమూనా చూపించి, ఆ విధముగా చేయమన్నాడు. దేవుడా జ్ఞాపించిన విధముగా మోషే చేశాడు. దేవుడు నాకు నమూనా చూపించాడు. నేను దాన్ననుసరిస్తూ యున్నాను” అని చెప్పాడు. ఇంతటితో నాకు తృప్తి కలుగలేదు. కావున నేను తదుపరి మద్రాసుకు వెళ్ళినపుడు సహో. భక్తిసింగ్‌ గారితో మొదటనుండి కలిసి యుండి, మద్రాసులోని యెహోవాషమ్మాలో పెద్దగా యుండిన సహో ఆర్‌.పి. దొరై రాజ్‌ గారిని కలిసి ఈ దర్శనము గూర్చి తెలుపమని అడిగాను. ఆయన దానిని పూర్తిగా వివరించి 'మన మేమి చేస్తున్నామో అది వాక్యానుసారంగా చేస్తున్నాము” అని చెప్పాడు.

గత 45 సంవత్సరములుగా ఈ సత్యము ననుసరించుట నా అనుభవము. దేవుని వాక్యమునకు విధేయత చూపించుట ద్వారా సంఘములో ఏ రీతిగా ఉజ్జీవము తీసుకురాబడిందో అన్న విషయము ప్రభువు మహిమలో యున్న సహో. ఆర్‌.పి. దొరైరాజ్‌ గారు నాతో వివరించిన విషయము ఈ పుస్తక పుటల్లో వివరించబడినది.

సహో. డి.ఆర్‌. దేవదాసు హెబ్రోను, హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌

Page 06

6 పిలుపు:

దేవుడు సహో. భక్తిసింగ్‌ను ఏర్పరచుకొని, రక్షణనిచ్చి, తన సేవకు పిలిచెను. ఆయన విశ్వాసము ద్వారా జీవించుటకు తర్ఫీదు నిచ్చెను. నిర్టీత సమయములో దేవుడతనిని మద్రాసుకు తీసుకువెళ్ళెను. దాదాపు అన్ని ప్రొటెస్టెంట్‌ / [క్రైస్తవ సంఘములు క్రీస్తు మహిమ గల సువార్త ప్రకటనకు ద్వారములు తెరచినవి. దేవుడు తన కనికరము చొప్పున అనేకుల హృదయములను తెరచుట ద్వారా అనేక స్రీ, పురుషులు తమ హృదయములలో (ప్రభువును స్వీకరించి పాపక్షమాపణపొందిరి. కూడికలకు వచ్చిన ప్రతివారు సంపూర్ణ బైబిలు ప్రతి, స్వంతముగా కల్గి యుండ వలెనననియు, ప్రతి కూటమునకు వాటిని తప్పక తీసుకు రావలెననియు సహో. భక్త్‌ సింగ్‌గారు నొక్కి చెప్పుచుండిరి. కూటములకు వచ్చు పిల్లలు కూడా స్వంత బైబిలు ప్రతి కల్లి యుండవలెనని చెప్పుచుండెను. నీవు ప్రతి వారికి బైబిలు నిమ్ము. నేను వారితో మాట్లాడెదనని ప్రభువు తనతో చెప్పినట్లుండెను. బైబిలు లేనివారు బైబిలు సొసైటికి వెళ్ళి బైబిలు ప్రతులు కొనుక్కున్నారు. అనేక స్త్రీ, పురుషులు రక్షణనొంది దేవుని వాక్యము కొరకైన తృష్ణ కలిగియుండిరి. ప్రతి దినము అనేక సంఘములలో కూడుచు ఆయన దాసుల ద్వారా వాక్యము వినుచుండిరి. ఒక దినము దేవుడు బాప్తిస్మమును గూర్చి మాటలాడుమని సహో. భక్తిసింగ్‌ గారితో చెప్పెను, మరునాడు అతడు బాప్తిస్మము గూర్చి బోధించి, నీటి బాప్తీస్మములో సాక్ష్యమిచ్చుట ద్వారా దేవుని వాక్యమునకు విధేయత చూపించుట ఎంత క్షేమకరమో వివరించెను. తిరిగి జన్మించిన అనేకులు ముందుకు వచ్చి బాప్తీస్మము నొందిరి. ఆ రీతిగా బాప్తీస్మము పొందగోరిన వారికందరికిని బాప్తీస్మము నిచ్చెను. ఈ సిద్ధాంతమును వివిధ సంఘముల ఫాదిరులు, పెద్దలు అంగీకరించలేదు. కావున బాప్తీస్మము నొందిన వారినందరిని వెలివేసి, సహో, భక్త్‌సింగ్‌ గారి కొరకు ద్వారములను మూసివేసిరి. ఇప్పుడు వారికి కూడిక స్థలము సమస్య అయెను. సహో. భక్తిసింగ్‌ గారు పరుషవాక్కంలో కూటముల నిమిత్తము ఒక ఇంటిని అద్దెకు తీసుకొనెను. రక్షింపబడి, బాప్తిస్మము నొందిన వారందరు వచ్చి దేవుని వాక్యము వినిరి. సహో. భక్తిసింగ్‌ గారు పరిశుద్ధుల మధ్య వాక్యధ్యానము చేయుచుండెను. వారందరు సంతోషముగ నుండిరి.

Page 07

7 రొట్టె విరుచుటను గూర్చిన ప్రత్యక్షత:

ఒక దినము సహో. భక్తిసింగ్‌ గారు ఉదయకాల మౌనధ్యాన సమయములో ఎఫెసీయులకు (వ్రాసిన పత్రిక శవ అధ్యాము 11-18 వచనములు చదువుచుండెను. (మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషుల మగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. 11-18) ఇచ్చట రక్షింపబడిన వ్యక్తి పరిపూర్ణుడు కావలెనను దేవుని కోర్కెను గ్రహించెను. ఒక వ్యక్తి రక్షింపబడుట తోడనే దేవుడు తృప్తి చెందుట లేదు. ఆ వ్యక్తి పరిపూర్ణుడు కావలెనని ఆయన కోరుచున్నాడు. ఎఫెసీ: 4:13. వచనము ఆయన సంఘములో చేసిన ఏర్పాటును గూర్చి తెలుపుచున్నది. “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులనుగాను ఉపదేశకులను గాను నియమించెను.” ఈ వచనములను అతడు తిరిగి తిరిగి చదివెను. అప్పుడు ప్రభువా “నేను సువార్తికుడను, పరిశుద్ధులను సంపూర్ణులనుగా చేయుటకు నన్ను పిలిచినట్లు నీ వాక్యము చెప్పుచున్నది. నేను ఇది ఎట్లు చేయగలను ? నీ కృప ద్వారా సువార్త ప్రకటించగలను. బైబిలు పఠనము చేయగలను. అయితే పరిశుద్ధుల జీవితములో సంపూర్ణత నెట్లు తీసికొని రాగలను?” దయతో వివరించుమని ప్రభువు నడిగెను. కన్పీటితో ప్రార్ధించుచుండెను. కొన్ని దినముల పిమ్మట ఆరంభము నుండి తనతో యుండిన సహో. ఆర్‌.పి. దొరైరాజ్‌, ఆర్‌. రాజమణి, మోజెస్‌ డాన్‌, రాజరత్బం, నోయల్‌బ్యారో గార్లతో సమస్యను పంచుకొనెను. వారందరు ఒక రాత్రి యంతయు ప్రార్థనలో గడుపగోరిరి. అందుకు వారు మద్రాసులోని పల్లవరం అను

Page 08

స్థలమునకు వెళ్ళిరి. పల్లవరం రైలు స్టేషన్‌ సమీపమున చిన్న కొండ యుండెను. ఆ కొండపైన ఒక పాత మసీదు ఉండెను. దానిని ఎవరూ ఉపయోగించుట లేదు. కావున వారు కొండ పైకి వెళ్ళి రాత్రంతయు ప్రార్థనలో గడిపిరి. సూర్యోదయమున అందరు దిగివచ్చి కొండ క్రింద కూర్చుండిరి. 1 కొరింథీ 11వ అధ్యాయము చదువుమని దేవుడు భక్త్‌సింగ్‌ గారితో సెలవిచ్చెను. వారందరూ కలిసి చదివిరి. సహో. భక్తిసింగ్‌ గారు మనము దీనిని పాటించుట లేదు. మనము దీని నాచరింపవలెనని (ప్రభువు కోరుచున్నాడు అనెను. అప్పుడు ఇతర సహోదరులు - దేవుడు దీనినాచరించుమని కోరుచున్నచో ఇప్పుడే ఆచరించెదమనిరి. వెంటనే ఒక సహోదరుడు సమీపములోని రాతిని దొరిలించెను. మరొక సహోదరుడు తనవద్ద గల పెద్ద రుమాలుతో దానిని కప్పెను. మరొక సహోదరుడు సమీపములోని దుకాణమునకు వెళ్ళి ఒక బన్ను, రెండు గ్లాసులు నిమ్మరసము తెచ్చెను. వాటిని ఆ రాతిపై నుంచిరి. తిరిగి 1 కొరింథీ 11వ అధ్యాయము చదివిరి. నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడను మాట వారి నెక్కువగా ఆకర్షించెను. (ప్రభువు వారికై చేసిన కార్యములన్చిటిని తలపోయ నారంభించిరి. వారి ప్రమేయం లేకుండానే ఒకరి తర్వాత ఒకరు ఆరాధింపనారంభించిరి. ఆరాధించుచుండగా దట్టమైన యొక మేఘము వారిని క్రమ్మగా, దైవ సన్నిధిని వాస్తవముగా అనుభవించిరి. ఇది నిజము కీర్తన 22:3. “నీవు పరిశుద్ధుడవు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవైయున్హావు”. దేవుని ప్రజలు ఆరాధించినపుడు, దేవుడు దిగివచ్చి వారి మధ్యలో నివసిస్తాడు. ఆరాధన తర్వాత దీనిని వారనుభవించిరి. తర్వాత తిరిగి 1 కొరింథీ 11వ అధ్యాయము చదువగా £8వ వచనము ద్వారా దేవుడు వారితో మాట్లాడెను. “కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను”. వారు తమ దృష్టికి తాము నీతిమంతులుగ (స్వనీతి) యుండిరి. మేము మంచి దైవభక్తి గలవారము. దేవుని పని కొరకు (సైద్ధాంతిక) వర్గీకృత సంఘములను విడచినవారము. ఇంకేమి పరీక్షించుకొనవలెను ? అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. సహో. భక్తిసింగ్‌ గారు ఈ వాక్యభావము తెలుపుమని ప్రభువు నడుగుచుందెను. అప్పుడు 189వ కీర్తన 28-24 చదువుమని ప్రభువు చెప్పెను. “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము.

Page 09

9 నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్యమార్ధమున నన్ను నడిపించుము”. సహోదరులందరూ దీనిని చదువగా ఇది రాజైన దావీదు ప్రార్ధనయని (గ్రహించిరి. ఇప్పుడు యధార్థముగా వారు ఇదే ప్రార్థన చేసిరి. దేవుడు జవాబిచ్చి, వ్యక్తిగతముగా వారి హృదయములలోని చెడుతనము, గర్వము, అసూయ మొదలగునవి చూపించెను. వారు ఏడ్చి ప్రభువు నొద్ద క్షమాపణకోరి ఒకరినొకరు క్షమాపణకోరిరి. ఇప్పుడు వారు దేవుని ఎదుటను, మనుష్యుల ఎదుటను సంపూర్ణులుగానున్నట్లు గ్రహించిరి. అప్పుడు సహో. భక్తిసింగ్‌ గారు కృతజ్ఞతలు చెల్లించి రొట్టె, పాత్రలను వారితో పంచుకొనెను. తర్వాత ప్రార్థనతో ముగించెను. ప్రార్ధనానంతరము సహోదరులందరిలో వాక్యము కొరకైన నూతన తృష్ణ కలిగెను. వారు సహో. భక్తిసింగ్‌ గారిని వాక్యము పంచుకొనమని అడిగిరి. ఆయన క్లుప్తముగా వాక్యము బోధింపగా గొప్ప సంతోషముతో గృహములకు మరలిరి. ఆ రాత్రి సహో. భక్తిసింగ్‌ గారితో దేవుడు మాట్లాడి “పరిశుద్ధులను సంపూర్ణతలోనికి తెచ్చుట ఎట్లు ? అని నీవు ప్రశ్నించావు. పల్లవరం కొండ క్రింద మీకందరికీ ఏమి జరిగిందో అదే జవాబు. మిమ్మును మీరు పరీక్షించుకొని, పతనములు ఒప్పుకొని, ఒకరితో ఒకరు విషయములు సరిచేసుకొని, మంచి మనస్సాక్షితో బల్లలో పాలుపొందినప్పడు మీరు సంపూర్మ్ణలు కాగలరు. ఇప్పుడు గ్రహించగలిగితివా? అని అడిగెను. సహో. భక్తిసింగ్‌ గారు “అవును ప్రభువా! ఇప్పుడు అర్థమైనది” అని చెప్పగా, ప్రభువు “సంఘములో పూర్ణత కొరకు దేవుని ప్రజలలో ఈ విధానము అమలు పరచమన్నాడు”. సహో. భక్తిసింగ్‌ గారు ఈ విధానమును సంఘములో (పప్రవేశపెట్టు మార్గమును మరింత స్పష్టముగా చూపించుమని ప్రభువు నడిగెను. అప్పుడు ప్రభువు స్పష్టముగా చూపించి దేవుని ప్రజలను సంపూర్ణతలోనికి నడిపించు విధానము గూర్చి బోధించెను. దేవుడు కొండపై ప్రత్యక్షపు గుడారమును మోషేకు చూపిన విధముగ (నిర్ణమ. £25:40), దేవుడు సహో. భక్తిసింగ్‌ గారికి సంఘమును గూర్చిన దర్శనమొసగెను. పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు ఆలయములో కూడినపుడు పాటలు పాడి దేవుని స్తుతించిరి.

Page 10

కీర్తన 33:1-3 1. నీతి మంతులారా, యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి స్తుతి చేయుట యధార్థ వంతులకు శోభస్కరము. £. సితారాతో యెహోవాను స్తుతించుడి. పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. 3. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి) కీర్తన. 47:6-7 6. దేవుని కీర్తించుడి. మన రాజును కీర్తించుడి. 7. దేవుడు సర్వభూమికి రాజైయున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి) కీర్త 66:1-2-£2 1. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. 2. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను సోత్రించుడి) మొదలగునవి. కావున స్తుతి కీర్తనలతో కూడిక ప్రారంభించు. ప్రభువు దినమున దేవుని ప్రజలను సమకూర్చి వారిని కలిసి కొన్ని కీర్తనలు పాడనిమ్ము. తర్వాత వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించుట నేర్పించు. కొంత సమయము ఒకరి తర్వాత ఒకరు ఆరాధించనిమ్ము. తర్వాత ప్రభువు బల్లను గూర్చి, అందులో పాలు పొందు విధము గూర్చి వివరించుము.

వారు ఆరాధించినపుడు నేను వచ్చి వారి మధ్యలో నివాసము చేతును. వారు నా సన్నిధిని అనుభవించెదరు. వారి హృదయములలో నా భయము నుంచుదును. మరియు వారిని హెచ్చరింపగా పశ్చాత్తాపపడి, దేవునితోను, మనుష్యులతోను సరిచేసికొందురు. వారు ఒప్పుకొనగా నేను క్షమించెదను. వారు సంపూర్ణులగుదురు. అప్పుడు రొట్టె విరచినచో దేవుని ప్రజలు యోగ్యముగా పాలుపొందెదరు. ఈ రీతిగా సంఘములో సంపూర్ణత తీసుకురావలెను. అప్పుడు వారు ఎత్తబడుటకు సిద్ధముగా నుందురు. దేవుని ప్రజలు ఎప్పుడైతే బల్లలో యోగ్యముగా పాలుపొందెదరో, అప్పుడు వారి మనస్సాక్షి నిర్మలముగా నుండి దేవుని వాక్యమును గైకొనుటకు సిద్ధముగా నుండును. అప్పుడు నీవు వర్తమాన మివ్వవచ్చును. నేను వారితో మాట్లాడగా వారు భయపడి, విధేయులగుదురు. సంఘము నా రాకడ కొకు సిద్ధపరచబడును. ఈ విధముగా నేను సంఘమును కట్టగా నీవు నాతో జతపనివాడవుగా నుందువు. 1 కొరింథీ : 3:9 (మేము దేవుని జత పనివారమై యున్నాము: మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునైయున్నారు) సహో. భక్తిసింగ్‌ గారు దేవుడు తనకు చెప్పిన దాని యంతటి ప్రకారము జరిగించి 1941 సంవత్సరము జులై మాసములో యెహోవాషమ్మా మందిరములో ఈ నియమముల ననుసరించి సంఘమును ప్రారంభించెను. ఇది మన సహవాసపు నిజ చరిత్ర.

Page 11

మొదట ఆరాధన, రెండవదిగా రొట్టె విరుచుట, మూడవదిగా వర్తమానము. తర్వాత కానుకలు ఇత్యాది కార్యక్రమములైన తర్వాత చివరిగా ఆశీర్వాద ప్రార్థన. మనము చమత్కారముగా మలచబడిన కథలను అనుసరించుట లేదు, సహో. భక్త్‌సింగ్‌ గారికి పల్లవరం కొండ దిగువన బయలుపరచబడిన పరలోక దర్శనము ననుసరించుచున్నాము. ఆ దర్శనమునకు విధేయుడై, ఆచరణలో పెట్టుటకు గొప్ప క్రయము నతడు చెల్లించవలసి వచ్చెను. దేవుడాయనను ఘనపరచెను. ఈ కార్యము భారత దేశములోనేకాక, ఇతర దేశములలో కూడా విస్తరించెను. ఈ నమూనాను మార్చుటకు ఎవరికిని హక్కు లేదు. మీలో ఎవరైనను (థైవసేవకులు, పెద్దలు, కాపరులు) ఈ నమూనాను అనుసరింపక పవపల్లవరం కొండ దిగువన బయలుపరచబడిన పరలోక దర్శనము ననుసరించుచున్నాము. ఆ దర్శనమునకు విధేయుడై, ఆచరణలో పెట్టుటకు గొప్ప క్రయము నతడు చెల్లించవలసి వచ్చెను. దేవుడాయనను ఘనపరచెను. ఈ కార్యము భారత దేశములోనేకాక, ఇతర దేశములలో కూడా విస్తరించెను. ఈ నమూనాను మార్చుటకు ఎవరికిని హక్కు లేదు. మీలో ఎవరైనను (దైవసేవకులు, పెద్దలు, కాపరులు) ఈ నమూనాను అనుసరింపక పోయినచో దర్శనమునకు అవిధేయులు అగుచున్నారు. మీరు దేవునికి లెక్క అప్పగించవలెను. మానవుడు తిరిగి జన్మించవలెనని దేవుని కోరిక. తర్వాత అతడు పరిపూర్ణుడై ఏ సమయములోనైనా ఎత్తబడుటకు సిద్ధంగా యుండవలెను. దేవుడు దానికొరకైన ఏర్పాటు చేసెను. మనము ఆ ఏర్పాటులో అమర్చబడి, సంపూర్ణులమై, ఆయన రాకడ కొరకు సిద్ధపడవలెను. దేవుడు మనలో వ్యక్తిగతంగాను, సంఘముగాను సంపూర్ణతను కోరుచున్నాడు. తద్వారా అది కళంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిరోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని కడిగి పవిత్రపరచుచున్చాడు. మనము ఆయనతో సహకరించవలెను. “వారు ... యెడతెగక యుండిరి” అపొ. కార్య 2:42.

Page 12

12 జీవముగల దేవుని సంఘపు నియమావళి

అపో. కార్య £2.42 (వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును యెడతెగక యుండిరి). ఈ నాలుగు మాటలలో లోతైన అర్థము గలదని మునుపు తెలిపితిని. 1. అపోస్తలుల బోధ వారు అపోస్తలుల బోధయందు యెడతెగక యుండిరి. అపోస్తలుల బోధయనగా నేమి ? ఈ బోధనిచ్చిన అపోస్తలుడెవరు ? ప్రభువైన యేసుక్రీస్తే అపోస్తలుడు. హెబ్రీ 3:1 (ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి). ఇచ్చట అపోస్తలుడనగా పూర్ణాధికారముతో దేవుని చేత పంపబడినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చేత పంపబడినవాడు. 1 యోహోను 4:9,10 “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను” - 9వ వచనము. “మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను క్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. అయన పూర్తి అధికారముతో వచ్చెను” యోహా 5:26-27. “తండ్రి యేలాగు తనంతట తానే జీవముగల వాడై యున్హాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగల వాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్చు తీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను”. ఆయన నిజత్వమేమి? (నిజముగా ఆయన యెవరు) హెట్రీ 1:3 (ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై యున్నాడు). ఆయన అదృశ్య దేవుని స్వరూపియై, సర్వసృష్టికి ఆది సంభూతుడై యున్నాడు. కొలొ. 1:15

Page 13

13 ఆయన ఈ లోకములోనికి వచ్చినపుడు బాప్తీస్మమిచ్చు యోహాను “ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొళ్టెపిల్ల” (యోహా 1:29) అని సంబోధించెను. మానవజాతి పాపములకై అర్పించబడవలసిన గొట్జెపిల్లగా దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఎందు నిమిత్తము ? నిత్య జీవము నిచ్చుటకు. యోహా 17:2-3 (2. నీవు నీ కుమారుని కిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారమిచ్చితివి. 8. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహా 3:36 (కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని ఉగ్రత వాని మీద నిలిచి యుండును). లోకములో ఆయన జీవితము =: ఆయన దేవుని మాటలే పలికినాడు. యోహా 3:34 (విలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ ననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును) దేవుడు మానవునితో మాట్లాడగోరెను. అయితే మానవుడు ఎప్పుడూ దేవుని స్వరము వినగోరలేదు. నిర్గమ £20:18,19 (ప్రజలందరు ఆ ఉరుములు మెరుపులు ఆ బూరద్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి - నీవు మాతో మాటలాడుము. మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము) అయితే దేవుడు ద్వితీ. కాం. 18:18 లో ఒక వాగ్షానమిచ్చెను. “ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను ... నేను అతని కాజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెప్పును. ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు, యూదులు (గ్రహింపలేకపోయిరి గాని సమరయ స్రీ గ్రహించెను. యోహా 4:25-26 (25 ఆ స్ర్త్రీ ఆయనతో - క్రీస్తన బడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినపుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా £26. యేసు - నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను). ఆమె విశ్వసించి, జీవమును పొంది సాక్షిగా మారెను. ఆయన దేవుని గొట్టెపిల్లగా నాయెను. “మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను.

Page 14

(4

మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెష 53:5. అతడు మన పాపముల కొరకు చనిపోయెను. అయితే మూడవ దినమున తిరిగి లేచెను. ఇప్పుడు సజీవుడుగా నున్నాడు. ఆయన - నేను జీవించువాడను మృతుడనైతిని. గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. ప్రకటన 1:18. ఆయన జీవించుచున్నాడు. ఆయన సజీవుడగు అపోస్తలుడు. ఆయన ఎల్లప్పుడు మనతో కూడనున్నాడు. మత్తయి 28:20 “నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగసమాప్తి వరకు సదా కాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను). ఆయన వారికి బోధ నిచ్చెను. ఆయన - “నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును” యోహా: 7:16-17. దేవుని చిత్తమనగా నేమి ? తండ్రి పరలోకము నుండి వాట్లాడి “ఈయన నా (వియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను. ఈయన మాట వినుడి” అని చెప్పెను. మత్తయి :17:5. ఇది మానవ జాతి అంతటికీ దేవుని చిత్తము. అందరూ ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విని ఆయనకు విధేయత చూపించవలెను.

శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలకు విధేయత చూపించిరి. ఆపో, కార్య 1:8 (అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునపుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూది గంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను). 2:23,24 (28 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యూయనను మీరు దుష్ప్రుల చేత సిలువ వేయించి చంపితిరి. 24. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను),. ఆపో. కార్య 3:14 (మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనవాని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి) మొదలగునవి. అపోస్తలుడైన పౌలు విధేయత చూపెను.

Page 15

15 అపో. కార్య. 9:20 (వెంటనే సమాజ మందిరములలో - యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను). ఈ శిష్యులకు పరిశుద్ధ గ్రంథములు (బైబిలు) లేవు. అయితే ఆయన సెలవిచ్చినదాని యంతటికి విధేయులైరి. ఇప్పుడు ప్రభువైన యేసు రక్త మాంసములలో నివసించుట లేదు. అయితే ఏలాగు ఆయన స్వరము విని విధేయులము కాగలము ? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన పేర్లలో ఒకటి 'దేవుని వాక్యము” ప్రకటన: 9:13. మనము దేవుని వాక్యముకు విధేయత చూపితే ప్రభువైన యేసుకు విధేయత చూపినట్లే. దేవుడు మనకు మన స్వంత భాషలలో దేవుని వాక్యాము (బైబిల్‌) ననుగ్రహించెను. మనము దానిని చదివి విధేయులము కావలెను. ఇది “అపోస్తలుల బోధ”. ఆ కారణముగా సహో. భక్తిసింగ్‌ గారు ప్రతి ఒక్కరు స్వంత బైబిల్‌ ప్రతి కలిగియుండవలెననియు, ఎక్కడకు వెళ్ళినా తమతో తీసుకుపోవలెననియూ నొక్కి చెప్పెను. బైబిలు తీసుకెళ్తున్నామంటే యేసుప్రభువును తీసికొని పోతున్నామని అర్థము. దేవుని వాక్యము చదివి విధేయుడగుట ద్వారా ఒక వ్యక్తి సంపూర్తుడు కాగలడు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము టైవజనుని సన్నద్దునిగాను, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడిన వానిగాను చేయును. £ తిమోతి. 3:15-17 (15. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి - నీవెరుగుదువు. దైవ జనుడు సన్నద్దుడై (ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్దపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది). యోహాను 8:31 (కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో - మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును (గ్రహించెదరు.) మత్తయి 10:32 (మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును). వారు విధేయులైరి. ఇదియే అపొస్తలుల బోధ వీరు అపొస్తులుల బోధ యందు ఎడతెగక యుండిరి. మనము కూడా ఈ నియమమును ఎడతెగక పాటించవలెను.

Page 16

అర్హ్పణలు : కానుకలు

సహో. భక్తిసింగ్‌ గారు ఈ విషయమై ప్రభువునిట్లడిగెను “ప్రభువా! మేము దేవునికి కానుకలు తేవలెనని వాక్యము బోధించుచున్నది. సంఘములోని ప్రతివ్యక్తి వద్దకు సంచి తీసుకొని పోవుట నాకిష్టము లేదు. అయితే దేవుని ప్రజలు దేవుని కివ్వవలెనని కోరుచున్నారు. మరి నేనేమి చేయవలెను”. అప్పుడు ప్రభువతనితో £2 రాజులు 12:9 చదువుమనెను. “అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించువారి కుడి పార్శ్కమందు దానినుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. ఈ వాక్యము చదువగానే సహో. భక్తిసింగ్‌ గారు వాక్యములో చెప్పబడిన విధానములో ఒక పెట్టెను చేసి సంఘములో నుంచి, వారి కానుకలు / అర్చణలను అందులో వేయుమని సమాజమునకు (ప్రకటన చేసెను. అయితే ప్రభువునకు హృదయ మర్చించినవారే తమ కానుకలు తేవలెనని నొక్కి చెప్పెడివాడు. కాబట్టి మన సహవాసములో చేయునదంతయు దేవుని వాక్య ప్రకారమై యున్చది.

Page 17

17 2. సహవాసము

ఐక్యత - ఒక వ్యక్తి ఒక్కడే సహవాసము కల్లియుండలేడు. ఇద్దరు లేక ముగ్గురు కూడి వచ్చినపుడు సహవాసము కల్గియుండగలరు. సహవాస మనగా సంఘము. సంఘమనగా నేమి ? 1 కొరింథీ. 1:2 లో అపొస్తలుడైన పౌలు ఈ రీతిగా వ్రాసెను. “కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడినవారై, పరిశుద్ధులుగా యుండుటకు పిలువబడినవారు”. ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవము కలిగియున్నారో వారు కూడి వచ్చినపుడు ఆ సమాజమే సంఘము. అపొస్తలుడైన పౌలు సంఘమును అనేక పేర్లతో పిలిచెను. శే సంఘము ఎఫెసీ 1:22 లి ఆయన శరీరము ఎఫెసీ 1:23 గ్ర దేవుని యింటివారు ఎఫెసీ 2:19 శే దేవుని ఆలయము ఎఫెసీ 2:21 ర్‌, దేవుని నివాస స్థలము ఎఫెసీ 2:22 6. దేవుని మంద అపొ. కార్య 20:28 ఇద్చ్‌ట దేవుని ప్రజలు ఐక్యతతో, ఒక్క మనస్సుతో జీవించెదరు. గలతీ 3:26 (యేసు క్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులై యున్నారు). ఇది వింతైన ఐక్యత. సంఘములోని క్రమమును వివరించుటకు అపోస్తలుడైన పౌలు క్రీస్తు శరీరము అన్న పదమును ఉపయోగించెను. క్రీస్తు శరీరమునకు శిరస్సు. కొలొస్స 1:18 (సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియై యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను.) కొలొ 1:19 (క్రీస్తు నందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ... తండ్రి అభీష్టమాయెను) కొలెస్స 2:9 (విలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది) ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది. ఎఫెసీ 1:23. సంఘము శరీరము. శరీరములో అనేక అవయవములుండును. అన్ని అవయవములు శిరస్సు యొక్క ఆధీనములో యుండును. అవి క్రమముగా కలిసి

Page 18

18 అవి క్రమముగా కలిసి పనిచేయుట ద్వారా శరీరమంతటికీ మేలు, క్షేమాభివృద్ధి కలుగును. క్రీస్తు సంఘమునకు శిరస్సు, శరీరము ఆయనకు లోబడియుండవలెను. ఎఫెసీ 5:24 (సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను) కళంకమైనను, ముడతయైనను లేని (పరిపూర్ణమైన) మహిమ గల సంఘముగా నిలువబెట్టవలెననునది సంఘము పట్ల దేవుని కోర్కె అపొస్తలుడైన పౌలు కోర్కె ఏమి ? “ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము”. కొలొస్స: 1:28 మొదట వ్యక్తిగత పరిపూర్ణత. తరువాత సంఘము మొత్తముగా పరిపూర్ణత. ఈ ఉద్దేశ్యము కొరకై దేవుడు అన్ని ఏర్పాట్లు చేసెను. మనుష్యుడు తనంతట తానుగా పరిపూర్ణుడు కాలేడు. మానవునికి రక్షణను అనుగ్రహించిన దేవుడు తానే మానవుని సంపూర్తునిగా చేయగలడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని ఆపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించెను. ఎఫెసీ 4:13 అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు దేవుని సేవకులు, కాపరులు, ఉపదేశకులు, స్థానిక పెద్దలు. అపొ. కార్య : £20:17,28(17 అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. £8. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మును అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి దేవుని సేవకులు, పెద్దలు కలిసి పనిచేయవలెను. వారందరు కలిసి కాపరులు. వారందరు కలిసి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిచర్య ధర్మము జరిగించవలెను. ఇది దేవుని కోర్కె అయితే ఈ దినములలో దేవుని సేవకులు, పెద్దలు ఒకరితో నొకరు విభేదించి పనిని చెరుపుచున్నారు. దేవుడు తన పని నిమిత్తము వారిని కలిపి యుంచెను. వారు కలిసి పనిచేసిన, పరిశుద్ధుల జీవితములలో పరిపూర్ణత తీసుకురాగలరు. శరీరము క్షేమాభివృద్ధి నొందును.

Page 19

19 తాపరుల విధి: పేతురు 5:1-3: తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలు పరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించు చున్నాను. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణచేయుచు దానిని కాయుడి ... మందకు మాదిరులుగా ఉండుడి. అపో. కార్య 20:28. వారు తమ విధిని నమ్మకముగా నిర్వర్తించవలెను. అప్పుడు వారు బహుమానము పొందెదరు. 1. పేతురు 5:4 “ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు”. 1. మంద లేక పరిశుద్ధుల విధి: “మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమునుశ్రద్ధగా తలంచుకొనుడి”. హెబ్రీ 13:7 “మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు. వార దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్పయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి”. హెబ్రీ 13:17,1 థెస్సలోని 5:12,13. ॥- ఐక్యతతో జీవించుట : ఎఫెసీ 4:13 ఎ) మొదటిగా దేవునితో ఐక్యత. నీవు తిరిగి జన్మించిన పిమ్మట, ఎడతెగక దేవునితో ఐక్యత కలిగి యుండవలెను. దావీదు దానిని కోరుకున్నాడు. కీర్తన 86:11. “యెహోవా నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగచేయుము”. దేవుడు మనలను ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యపరచెను. ఆయనతో కూడ లేపెను. ఎఫెసీ 2:1. మనలను ఆయనతో ఊడా లేవి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2:7. మనము ఈ సత్యమును గుర్తించి ఈ ఏకత్వమును, ఐక్యతను అనుభవించవలెను.

Page 20

బి) ఒకరితో నొకరు ఐక్యత కలిగి యుండుట.

కాట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనవలెనని... ప్రభువును బట్ట ఖైదీనైన నేను విమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ 4:13. ఇది క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి తెచ్చును. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ! ఎంత మనోహరము 1” కీర్తన 133:1, అచ్చట ఏ భేదములు యుండవు. సంఘము సంపూర్ణత నొందును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిమళ సువాసన అంతటా వ్యాపించును. అంతములో ప్రభువు మహిమగల సంఘమును అప్పగించగలడు. ఇది సంఘ క్రమము. ఇదియే సహవాసము. వారు సహవాస మందు ఎడతెగక యుండిరి, మనము కూడా సహవాసములో ఎడతెగక యుండవలెను.

Page 21

21 ౩. రొట్టె విరచుట

లూకా 22:13-20 (18. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. 14.ఆ గడియ వచ్చినపుడు ఆయనయు ఆయనతో కూడ అపోస్తలులును పంక్తిని కూర్చుండిరి. 15. అప్పుడాయన నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. 16. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి 17. ఆయన గిన్నె నెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి - మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి. 18. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను (ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. 19. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి - ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. 20. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన)

1. కొరింథీ 11:23-32 (28. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 24. దానిని విరిచి - యిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. £25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలో నిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 27. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు, రక్తమును గూర్చియు అపరాధి యగును. £8. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. £29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

Page 22

22 30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారు చాలా మంది నిద్రించుచున్నారు. 81. అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్చు పొందకపోదుము. 82. మనము తీర్చు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడు చున్నాము. ఇది మనకు మొదటి పస్కా పండుగను జ్ఞాపకము చేయును. నిర్ణమ 12:8-11 (8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. 9. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. 10. దానిలొ ఉడికి ఉడకనిదైనను నీళ్ళతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దాని లోని దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. 11. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కజ్జలు చేతపట్టుకొని త్వరపడుచు దాని తినవలెను అది యెహోవాకు పస్మాబలి). ఇది మూడు విషయములను మనకు జ్ఞాపకము చేయును.

1. విమోచన (దాసత్వము నుండి)

2. విడుదల (ఐగుప్తు నుండి)

8. దేవుని సేవించుట. నిర్ణమ 8:1 9:1 దేవుని (ప్రజలు దీనిని తరమువెంబడి తరము ఆచరింపవలెను. అయితే వారు యెహోషువ కాలము వరకు అనుసరించిరి. యెహో. 5:10 ఇశ్రాయేలీయులు గిల్లాలులో దిగి ఆ నెల పదునాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. అటు పిమ్మట దానినాచరించుట మానివేసిరి. పస్కా గొళ్టె నిజమైన గొళ్టెపిల్లకు ముంగుర్తు. ఈ పండుగ కొనసాగించవలసి యున్చది. కావున దేవుడు హిజ్క్మియాతో మాట్లాడగా అతడు తిరిగి ప్రారంభించెను. 2 దినవృత్తాం : 30:1-5 (1. మరియు హిజ్మియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్మా పండుగ ఆచరించుటకై యొరూషలేములోనున్న యెహోవా

Page 23

2 మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారకందరికిని, యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయీమీయులకును, మనష్నేవారికిని పత్రికలను పంపెను. £. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్టించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను, మొదటి నెల యందు పస్కా పండుగ జరుగకపోగా 8. రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపు వారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. 4 ఈ సంగతి రాజునకును సమాజపు వారికందరికిని అనుకూలమాయెను. ర్‌. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి, ఇశ్రాయేయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్క్మాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్నెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి). అప్పటి నుండి యేసుక్రీస్తు దినముల వరకు దాని నాచరించిరి. యేసు ప్రభువు చివరి పస్క్మాపండుగ నాచరించెను. పస్కా పండుగ నాచరించు నియమములు. నిర్ణమ 12: 1-44 లో స్పష్టముగా వ్రాయబడినది. రొట్టెవిరుచుట కూడా అలాగే ఒక జ్ఞాపకార్థ పండుగ. పస్కా వ సాధారణగొట్టిపిల్ల వధించబడి, తినబడును. రొట్టె విరుచుట : పరలోకపు గొట్టెపిల్ల ఆర్పించబడినది. 1 కొరింథీ 5:7 (మీరు పులిపిండిలేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్మా పశువు వధింపబడెను). ఈ గొళ్టెపిల్ల తినబడవలెను : యేసు ప్రభువు ఈలాగు చెప్పెను. యోహాను 6:51-56(51 పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 52. యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. 58. కావున యేసు ఇట్లనెను. మీరు

Page 24

24 మీరు మనుష్యుకుమారుని శరీరము తిని ఆయన ర్తము క్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. ర54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును. ర్‌ర్‌. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. 56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. సాధారణఆహారము న భౌతిక శరీరము పోషణకొరకు జీవాహారము ర్‌ ఆత్మీయ దేహము పోషణకొరకు ఆయన నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 1 కొరింథీ

11:24-25 మనము పాలు పొందునపుడు 8 అంశములు ప్రకటిస్తూ యున్నాము. 1. నేను విమోచించబడి యున్నాను. ఎఫెసీ 1:7, కొలోస్సీ 1:14 2. నేను స్వాతంత్ర్యము కల్గియున్నాను. ఎఫెసీ 1:13, ॥ కొరింథీ £2:17, గలతీ 5:1

3. నేను దేవుని సేవిస్తూ యున్నాను. । కొరింథీ 11:26 ఇది సాంప్రదాయము కాదు. ఒక సాక్ష్యము ఎవరు తినవలెను ? తిరిగి జన్మించినవారు మాత్రమే. పరదేశి (అవిశ్వాసి) తినకూడదు. ఏలాగు తినవలెను ? పులియని రొట్టెతో తినవలెను. | కొరింథీ 5:8 రెండు రకముల పులిపిండి. మత్తయి 16:6-12. (ఎ) పరిసయ్యుల పులిపిండి : లూకా 12:1 వేషధారణ: దేవుడు వేషధారణనిష్టపడడు. మత్తయి 2£23:13-15(18,14 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీరందులో (ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు. 15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు).

Page 25

25 (బి) సద్దూకయ్యుల పులిపిండి : వారు పునరుత్థానమును నమ్మరు. అపో. కార్య. 23:8 ప్రభువు బల్లలో పాలుపొందునపుడు మనమిచ్చు సాక్ష్యము. 1. నేను విమోచించబడిన వాడను నా జీవితము పవిత్రముగా ఉన్నది. £. నేను ఎత్తబడుటకు సిద్ధముగా యున్నాను. ఆ కారణముగా మనము పరీక్షించుకొని మనుష్యుల ఎదుటను, దేవుని ఎదుటను జీవితములు సరిచేసికొని పాలుపొందవలెను. 1 కొరింథీ 11:28,29, £29. ఇది (ప్రభువు రాకడకు సిద్ధముగా యున్నామని మనమిచ్చు సాక్ష్యము. నేను సంపూర్తుడనుగా యున్నాను. మేము సంపూర్తులమై యున్నాము అని సాక్ష్యమిస్తూ యున్నాము. బల్లను పంచుట ఎలాగు ? లూకా 22:17 మిగిలిన వర్గీకృత సంఘములలో పాదిరి మాత్రమే పంచును. అయితే అది దేవుని వాక్యానుసారమైనది కాదు. ప్రభువు మీరే పంచుకొనుడని చెప్పెను. అందరూ నా యెదుట సమానులే. కావున మనమేమి చేసినను దేవుని వాక్యానుసారముగా చేయవలెను. పాలుపొందునపుడు మన నిరీక్షణను ప్రకటిస్తున్నాము. యోహా. 14:2 నా తండి యింట అనేక నివాసములు కలవు : లేని యెడల మీతో చెప్పుదును. నేను మీ కొరకు స్థలము సిద్ధ పరచవెళ్ళుచున్నాను) 1 యోహా 3:2 ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్ష పరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనపుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము) వారు రొట్టె విరుచుటలో ఎడతెగక యుండిరి. మనము కూడా ఎడతెగక కొనసాగవలెను.

Page 26

26 4. ప్రార్థన

అపొ. కార్య 2:32, ఎఫెసీ 6:10-20 ప్రార్థన ద్వారా దేవునితో సంభాషించగలము. ఒకప్పుడు పాపమును బట్టి దేవుని నుండి వేరుచేయబడియుంటిమి. యెషయా 59:1, 2(1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా 1. వాస్తము £. కురుచకాలేదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. £. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపస్థులముగా చేయబడితిమి. మనము దత్తపుత్రత్వము (లేక) కుమారత్వము పొందియున్నాము. రోమా 8:15 (విలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా తండ్రీ అని మొట్ట పెట్టుచున్నాము) ఇప్పుడు అబ్బా, తండ్రీ అని పిలుస్తూ ఆయన చెంతకు రాగలము. మనము విశ్వాసముతో దేవుని చెంతకు రావలెను. హెబ్రీ 11:1 (విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు బుజువునై యున్నది) (విశ్వాసము లేకుండ దేవుని సంతోషపరచజాలము. హెబ్రీ 11:6) (విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్హాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా). మనము ప్రతిదాని కొరకు ఆయన మీద ఆధారపడుట ఆయనకిష్టము. మనము ఎందుకు ప్రార్ధించవలెను ? 1. మనము ప్రార్థించవలెనని దేవుడు అజ్ఞాపించెను. “యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి”. యెషయ 55:6 “నాకు మొట్ట పెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును” యిర్మియా 33:3 “అడుగుడి మీ కియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును” మత్తయి 7:7

Page 27

27 2. మనము ప్రొర్థింపగా దేవుడు జవాబిచ్చును, మరియు మనము ప్రోత్సహింపబడుదుము. దావీదు అనుభవము : “యెహోవా నా రోదన ధ్వని విని యున్నాడు. పాపము చేయువారలారా, మీరందరు నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు. యెహోవా నా ప్రార్థన నంగీకరించును” కీర్తన 6:8,9 “వారికీలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.” యెషయా 65:24 ప్రార్ధించు విధమేమి ? దావీదు జీవితము 1. పాపము లేకుండ “నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును” కీర్తన 66:18 ఒప్పుకోలు : “నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటిని క్షమింపుము” కీర్తన £25:18. “నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్ఫిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని” కీర్తన 32:5 క్షమాపణనిశ్చయత “నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు” కీర్తన 32:5 “ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు” కీర్తన 103:3 £2. నిజముగా ఆయనకు మొజ్జ పెట్టవలెను “తనకు మొజ్జపెట్టువారికందరికి తనకు నిజముగా మొజ్జ పెట్టువారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు” కీర్తన 145:18. 3. దేవుని చిత్తమును జరిగిస్తా ఆయనకు మొజ్జ పెట్టవలెను. “దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము ఎవడైనను దైవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును” యోహా 9:31

Page 28

28 4. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించవలెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండి సన్నిధికి చేరగలిగియున్నాము. ఎఫెసీ 2:18. యేసు చెప్పెను - మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెహా 16:23. ప్రార్థన ౩ విధములు. 1. బహిరంగ ప్రార్థన : పరిశుద్ధ (గ్రంథములో బహిరంగ ప్రార్థన సందర్భములు అనేకము కలవు. (ఎ) “యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలము వరకు యెహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసికొనుచు - అయ్యో, ప్రభువా, యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి” ? యెహో. 7:6-9 ఇచ్చట యెహోషువ బహిరంగముగా ప్రార్ధించెను. (బి) దావీదు బహిరంగముగా ప్రార్ధించెను. “అబ్రహము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూల పరచుము” 11 దిన వృత్తాం 29:18. (సి) ప్రారంభ సంఘము బహిరంగముగా ప్రార్ధించెను. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొజ్జపెట్టిరి. నాధా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగచేసిన వాడవు. అపో. కార్య 4:24 (డి) పౌలు సీలలు ప్రార్ధించిరి. అయితే మధ్య రాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపో. కార్య 16:25

Page 29

29 2. కుటుంబ ప్రార్థనలు మనము కుటుంబ ప్రార్థన కలిగియుండవలెనని బైబిలు బోధించుచున్నది. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ యింట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ద్వితీ. కాం. 6:6, 7 ప్రవక్తయైన యెషయా దీని ప్రకారము చేసి సాక్ష్యమివ్వగలిగెను. ఇదిగో నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. యెహ 8:18 3. రహస్య ప్రార్థనలు అ(బ్రాహము ఒంటరిగా దేవునికి ప్రార్థించెను. “ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అ బ్రాహము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను గా దుష్యలతో కూడా నీతివుంతులను నాశనము చేయుదువా ?” అది కాం. 18:22,23 యిర్మీయా ఒంటరిగా దేవుని ప్రార్థించెను. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆక్రయ పత్రమును నేనప్పగించిన తర్వాత యెహోవాకు ఈ లాగున ప్రార్థన చేసితిని యిర్మియా 32:16 యేసుప్రభువు కూడా ఒంటరిగా దేవుని ప్రార్ధించెను. ఆ దినములయందు ఆయన ప్రార్ధన చేయుటకు కొండకు వెళ్ళి, దేవుని ప్రార్ధించుట యుండదు రాత్రి గడిపెను. లూకా 6:12. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని... ప్రార్ధించెను, లూకా 22:41,42. ప్రార్థన ద్వారా అన్నింటి కొరకు దేవుని మీద ఆధారపడుచున్నామని చూపిస్తున్నాము. కాబట్టి సంఘములో మనమేమి చేసినను, పాటలు పాడినను,

Page 30

30 ఆరాధించినను, రొట్టెవిరిచినను, (ప్రార్థన చేసినను, మనము దేవుని వాక్యములోని సూత్రములను పాటిస్తూ యున్నాము. మొదటి శతాబ్ద సంఘము పూర్తిగా ఈ నియమములయందు నిలిచి ఎడతెగక యుండిరి. వారి జీవిత విధానమే మనకు మాదిరి, మనము కూడా అవే నియమములను ఎడతెగక పాటింపవలెను.

Page 31

31 ముగింపు ఈ దినములలో మన సంఘములనేకము మన ప్రియ సహోదరుడగు భక్తిసింగ్‌ గారికి ప్రత్యక్షపరచబడిన దర్శనము ననుసరించుట లేదు. కారణమేమనగా మనము ఎక్కువ సమయము సంఘములో గడుపుట కిష్టపడుట లేదు. మనము ఐహిక విచారములతో నింపబడియున్నాము. ఆరంభము నుండి ఉన్నవారు కూడా మూడు వర్తమానములుగాక రెండు వర్తమానములే కల్లియుండుటకు రాజీపడినారు. మనము లోకముతోరాజీపడుచున్నాము కాబట్టి మన సంఘములనేకమైన వాటిలో విభజనలు, అంతఃకలహములు జరుగుచున్నవి. ఇచ్చట మనము జరిగించు ప్రతిదానికి దేవునికి లెక్క చెప్పవలెను. మనము తేలికగా ఎంచినచో దేవుడు తీర్పు తీర్చును. మనలో ప్రతి ఒక్కరము (ప్రత్యేకించి సంఘములో నాయకత్వములో ఉన్నవారము) మన మార్గములను పునః పరిశీలించుకొని, మనుష్యులను సంతోష పెట్టుటకుగాక, దేవుని సంతోష పెట్టునట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు మిమ్ము నాశీర్వదించును గాక

You’ve reached the end of this resource.