CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

2 సమూయేలు 22

2 Samuel 22

Changepassage

Chapters of 2 Samuel

  1. 1
  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
  18. 18
  19. 19
  20. 20
  21. 21
  22. 22
  23. 23
  24. 24
Another book →
Readingsettings

Language

Text size

Reading light

1

And David spake unto the LORD the words of this song in the day that the LORD had delivered him out of the hand of all his enemies, and out of the hand of Saul:

యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు.

2

And he said, The LORD is my rock, and my fortress, and my deliverer;

యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.

3

The God of my rock; in him will I trust: he is my shield, and the horn of my salvation, my high tower, and my refuge, my saviour; thou savest me from violence.

నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు.

4

I will call on the LORD, who is worthy to be praised: so shall I be saved from mine enemies.

స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.

5

When the waves of death compassed me, the floods of ungodly men made me afraid;

మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.

6

The sorrows of hell compassed me about; the snares of death prevented me;

పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.

7

In my distress I called upon the LORD, and cried to my God: and he did hear my voice out of his temple, and my cry did enter into his ears.

నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది.

8

Then the earth shook and trembled; the foundations of heaven moved and shook, because he was wroth.

అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి.

9

There went up a smoke out of his nostrils, and fire out of his mouth devoured: coals were kindled by it.

ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి.

10

He bowed the heavens also, and came down; and darkness was under his feet.

ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.

11

And he rode upon a cherub, and did fly: and he was seen upon the wings of the wind.

ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.

12

And he made darkness pavilions round about him, dark waters, and thick clouds of the skies.

అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.

13

Through the brightness before him were coals of fire kindled.

ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.

14

The LORD thundered from heaven, and the most High uttered his voice.

యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.

15

And he sent out arrows, and scattered them; lightning, and discomfited them.

తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.

16

And the channels of the sea appeared, the foundations of the world were discovered, at the rebuking of the LORD, at the blast of the breath of his nostrils.

యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.

17

He sent from above, he took me; he drew me out of many waters;

పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.

18

He delivered me from my strong enemy, and from them that hated me: for they were too strong for me.

బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.

19

They prevented me in the day of my calamity: but the LORD was my stay.

విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.

20

He brought me forth also into a large place: he delivered me, because he delighted in me.

యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.

21

The LORD rewarded me according to my righteousness: according to the cleanness of my hands hath he recompensed me.

నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.

22

For I have kept the ways of the LORD, and have not wickedly departed from my God.

ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.

23

For all his judgments were before me: and as for his statutes, I did not depart from them.

ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.

24

I was also upright before him, and have kept myself from mine iniquity.

ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను.

25

Therefore the LORD hath recompensed me according to my righteousness; according to my cleanness in his eye sight.

నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.

26

With the merciful thou wilt shew thyself merciful, and with the upright man thou wilt shew thyself upright.

నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.

27

With the pure thou wilt shew thyself pure; and with the froward thou wilt shew thyself unsavoury.

నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.

28

And the afflicted people thou wilt save: but thine eyes are upon the haughty, that thou mayest bring them down.

యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.

29

For thou art my lamp, O LORD: and the LORD will lighten my darkness.

యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.

30

For by thee I have run through a troop: by my God have I leaped over a wall.

నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.

31

As for God, his way is perfect; the word of the LORD is tried: he is a buckler to all them that trust in him.

దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.

32

For who is God, save the LORD? and who is a rock, save our God?

యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

33

God is my strength and power: and he maketh my way perfect.

దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.

34

He maketh my feet like hinds’ feet: and setteth me upon my high places.

ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.

35

He teacheth my hands to war; so that a bow of steel is broken by mine arms.

నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.

36

Thou hast also given me the shield of thy salvation: and thy gentleness hath made me great.

నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.

37

Thou hast enlarged my steps under me; so that my feet did not slip.

నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు.

38

I have pursued mine enemies, and destroyed them; and turned not again until I had consumed them.

నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.

39

And I have consumed them, and wounded them, that they could not arise: yea, they are fallen under my feet.

నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు.

40

For thou hast girded me with strength to battle: them that rose up against me hast thou subdued under me.

నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.

41

Thou hast also given me the necks of mine enemies, that I might destroy them that hate me.

నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.

42

They looked, but there was none to save; even unto the LORD, but he answered them not.

వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.

43

Then did I beat them as small as the dust of the earth, I did stamp them as the mire of the street, and did spread them abroad.

నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.

44

Thou also hast delivered me from the strivings of my people, thou hast kept me to be head of the heathen: a people which I knew not shall serve me.

నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.

45

Strangers shall submit themselves unto me: as soon as they hear, they shall be obedient unto me.

పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.

46

Strangers shall fade away, and they shall be afraid out of their close places.

అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.

47

The LORD liveth; and blessed be my rock; and exalted be the God of the rock of my salvation.

యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.

48

It is God that avengeth me, and that bringeth down the people under me,

ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.

49

And that bringeth me forth from mine enemies: thou also hast lifted me up on high above them that rose up against me: thou hast delivered me from the violent man.

ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.

50

Therefore I will give thanks unto thee, O LORD, among the heathen, and I will sing praises unto thy name.

కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.

51

He is the tower of salvation for his king: and sheweth mercy to his anointed, unto David, and to his seed for evermore.

తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.

King James Version (1769). Public domain. Text courtesy of the Crosswire Bible Society and eBible.org.

Indian Revised Version (IRV) Telugu, © 2017, 2019 Bridge Connectivity Solutions, used under the Creative Commons Attribution-ShareAlike 4.0 licence (CC BY-SA 4.0), via eBible.org. Reformatted into chapter files by El-Shaddai Prayer House; the licensor does not necessarily endorse these changes.