CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 108

జై జై జై జై రాజుల రాజా

jai jai jai jai raajula raajaa

2 Cor 8:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:జై జై జై జై రాజుల రాజా (2)పాత్రుడ వీవే మా ప్రభు వీవే (2) - జై జై జై జై రాజుల రాజా (2)
1. అన్ని కాలములలో నీ నామము - మహోన్నతము మహోన్నతుడా (2) వాగ్దానము నెరవేర్చిన దేవా (2) - మాట తప్పని మహోపకారి (1)
2. దూతల మాదిరి గీతముల్ పాడుచు - సతతము నిన్నే స్తోత్రించెదము గొల్లలు గాంచిన ఘన కాపరి - మా ఉల్లము నందు ఉల్లసించెదము
3. తూర్పున తారను గాంచిన జ్ఞానులు - రాజుల రాజ నీవే యనుచు బంగారము సాంబ్రాణి బోళమును - అర్పించి ఆరాధించిరిగా
4. ధనవంతుడవగు ఓ మా ప్రభువా - ధనహీనునిగా నైతివి మాకై మా దారిద్ర్యము తీసివేయ - నరరూపమున జన్మించితివి
5. యేసు ప్రభుండా రక్తము కార్చి - ఎంచి మమ్ము విమోచించితివి ఎంచలేను నీ మేలుల నెపుడు - ఎన్నదగిన మా దేవుడ నీవే
6. మాకై సిలువలో మరణించితివి - మరణపు ముల్లును విరచిన ప్రభువా యుగయుగములకు నీకే మహిమ - నిరతము స్తోత్రము హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu