పల్లవి:యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట (2)
1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్ (2) స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి (2) ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును (2)
2. మరణపులోయ ద్వారా - సరిగా నడిపించును అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్ హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను