పల్లవి:యెహోవా నా కాపరి నాకు లేమి లేదుపచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ (2)
1. మరణపు చీకటిలో - తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను - కరుణతో ఆదరించున్ (2)
2. పగవారి యెదుట - ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ - పరవశ మొందెదము
3. నూనెతో నా తలను - అభిషేకము చేయున్ నా హృదయము నిండి - పొర్లుచున్నది
4. చిరకాలము నేను - ప్రభు మందిరములో వసియించెద నిరతం - సంతసముగా నుందున్