CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 114

ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము

o premagala yesu preminchinaavu mammu

Revelation 1:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ముస్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు (2)
1. అద్భుత యాగమందు - అందరికై బలియై (2) అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి (2)
2. దాసులమై మేముండ - మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ
3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి
4. ఎడారి అడవిలోన ఊటల నదులు నడిపి ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్
5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు
6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె
7. మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్ని ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు

Back to Hebron Seeyonu Geethalu