పల్లవి:హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1)హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1)హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1)
1. క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతో (2) గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదే (1) అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి (1)
2. మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించె మహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవే అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
3. ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్ ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్ అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
4. నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్ అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్ అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
5. ఏమి వచ్చినన్ జీవితయాత్రలో - ఆమెన్ యనుచు సహించెదము శ్రమలలోనే శాంతి యుండున్ - అద్భుత యానందము అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
6. దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైనను ఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకని మీరందరు పాడుడి - హల్లెలూయ పాడుడి