CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 121

శాంతిదాయక యేసు ప్రభూ

shaantidaayaka yesu prabhoo

Songs of Solomon 5:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:శాంతిదాయక యేసు ప్రభూ - శాంతిదాయక యేసు శాంతిదాయక
1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడా (2) నిత్య రాజ్య మహిమకు పిల్చిన (2) సత్యముగ నిన్ను పూజించెదము (2)
2. పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచి పరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన
3. సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివి రిక్తులకు మహదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన
4. ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమో గురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము
5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడా" బోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె
6. అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీక్షలో నిల్చు నిరీక్షణలో అక్షయ దేహ మిచ్చెదవని - ప్రత్యక్షతకై వేచియుండెదము
7. సర్వ కృపానిధి సర్వేశ్వరా - సర్వము స్వతంత్రించుకొన ఉర్వియందు విజయములే యని - సర్వోన్నతుడు నుడివెను
8. పరలోకానంద పరిపూర్ణుడా - సకలాశీర్వాద సంయుతుడా మహిమ ఘనత ప్రభావంబులు - నీవే యని ప్రహర్షించెదము

Back to Hebron Seeyonu Geethalu