పల్లవి:హృదయ మర్పించెదము ప్రభునకు - స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి (2)
1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ (2) పాపుల పాపము తొలగించుటకు (2)- నిత్యజీవము నిచ్చెన్ (1)
2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు - నిత్య నిరీక్షణ నిచ్చెన్
3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు - నిలువకు పాపములో
4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల - ఇదియే మా వినతి