CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 13

దేవా నీ ముఖమును నాకు

devaa nee mukhamunu naaku

Psalms 27:9-14

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవా నీ ముఖమును నాకు - దాచకుము నా ప్రభువా (2)నీ సేవకుని కోపముచే - త్రోసివేయకు యెహోవా (2)
1. దేవా నా రక్షణకర్త - నీవే నాసహాయుడవు (2) నన్ను దిగనాడవలదు (2)- నన్ను విడువకుము (1)
2. నాదు తలిదండ్రులు - నన్ను విడచినను నా దేవుండగు యెహోవా - నన్ను చేరదీయును
3. నాకై పొంచియున్నట్టి - వారిని చూచి నన్ను సరళ దారిని నడుపు - మంచి మార్గము భోధించు
4. నాపై లేచియున్నారు - అబద్ధ సాక్షులు క్రూరుల్ నన్నప్పగించకు దేవా - నాదు విరోధులకు
5. యెహోవా దయ పొందెదను - సజీవుల దేశమున ఇట్టి నమ్మకము లేని - యెడల నే నేమగుదును
6. ధైర్యము తెచ్చుకొని - నిబ్బర హృదయము గల్గి యెహోవా దేవుని కొరకు - కనిపెట్టుకొని యుండుము

Back to Hebron Seeyonu Geethalu