CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 14

ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా

udaya saayantramula nellavelala prabhuvaa

Psalms 27:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా - నే ధ్యానించి పాడెదన్ (2)పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధునిదని దూతలు - పాడుట వినబడుచుంచున్ (2)
1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు- నేనెవరికి వెరతును (2) యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె - శత్రువులు తొట్రిల్లిరి (2)
2. యుద్ధము చేయుటకు దండు దిగినను - నా హృదయము భయపడదు యుద్ధము రేగినను దీనియందు నే - ధైర్యము విడువకుందున్
3. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని - దానిని వెదకు చున్నాను యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున - ధ్యానించుటయే నా ఆశ
4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును - నా ఆపత్కాలమునందు తన గుడారములోన నను దాచియుంచును - దుర్గముపై నెక్కించున్
5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని - నీవు పల్కితివి గాన నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను - నీ సముఖమును దాచకు
6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను - యెహోవాయే చేరదీయున్ నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద - నీ కొరకు కనిపెట్టెదన్
7. యెహోవా నాకై యుద్దేశించినది - ఆయనయే నెరవేర్చును మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల - కోరికలు నెరవేర్చును

Back to Hebron Seeyonu Geethalu