పల్లవి:కొనియాడి - పాడి కీర్తించి - వర్ణించెద నిను - నా ప్రభువా (2)
1. పరిశుద్ధుడవు - నీతిమంతుడవు (2) - పాపపు వస్త్రము - మార్చిన దేవా (2) ప్రాపుగ రక్షణ - వస్త్రమిచ్చితివి (1) - పొగడెద నిన్ను ధవళవర్ణుడా (2)
2. తూర్పు జ్ఞానులు - నీ కర్పించిరి - బంగారు సాంబ్రాణి బోళము తెలుపబడెను నీ ఘనవిజయము - భజియించెద నిన్ను రత్నవర్ణుడా
3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను - ఘనుడా నాకు ప్రభుడవు నీవే పదివేలలో నా ప్రియుడగు ప్రభువా - పరికించి నిన్ను పాడి స్తుతించెద
4. ఆరాధించెద ప్రభువా దేవా - ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా - స్తుతియు ఘనత మహిమయు నీకే