CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 137

దేవా నాయందు నీకు

devaa naayandu neeku

Jeremiah 31:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమ - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను (1)హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
1. దిన దినము నీదు ప్రేమ - రుచి చూచుచున్నాను (2) దయగల జీవాహారముతో - పోషించుచున్నావు (2) దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను (2)
2. నా పాదములను నీవు - బండపై నిలిపితివి నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి దేవా! నీ దయ నా యెడల - అత్యున్నతము - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
4. వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా విడువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
5. మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

Back to Hebron Seeyonu Geethalu