పల్లవి:గాయములన్ గాయములన్ - నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)
1. సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను (2) వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)
2. మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై
3. మా అతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు
4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై
5. క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె