CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 168

నా ప్రాణమా నా సర్వమా

naa praanamaa naa sarvamaa

Psalms 103

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా ప్రాణమా నా సర్వమా (2)- ఆయన పరిశుద్ధ నామమునకు (1)సదా స్తుతులను చెల్లించుమా (1)- మరువకు ఆయన మేలులను (2)
1. క్షమించును నీ పాపములను (2)- కుదుర్చును నీ రోగములను (1) క్షమించును నీ పాపములను (1)- కుదుర్చును నీ రోగములను (1) కీడు నుండి నీ ప్రాణమును రక్షించి - కరుణా కిరీటము దయచేయును (2)
2. పడమటికి తూర్పెంత దూరమో - పాపములన్నియు దూరపరచెను తండ్రి తన తనయులపై జాలిపడునట్లు - భక్తుల యెడల జాలిపడును
3. నిన్ను మేలులతో తృప్తి పరచున్ - నీ యౌవనము నూతన పరచును బాధితులకు బహున్యాయము తీర్చు - యెహోవా యెంతో దయాళుడు
4. మనము నిర్మింప బడినరీతి - మంటి వారమని ప్రభు యెరుగును గడ్డి పువ్వువలె నున్నది మన బ్రతుకు - గాలి వీచగ అది యెగిరిపోవున్
5. స్థిరపరచె తన సింహాసనము - సర్వలోకమును యేలు చుండె నీ యాజ్ఞలను పాలించెదము - నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా

Back to Hebron Seeyonu Geethalu