పల్లవి:ఓ ప్రభు నీవే ధన్యుడవు (2)సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1)ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2)
1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే - క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్ (2) పరమందలి ప్రతి ఆశీర్వాదం (2) క్రీస్తు నందు మనకు సర్వంనొసగె (2)
2. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె - పరలోక దీవెనలు మనకొసగె
3. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించె ఒకదినము అధికారము మనకొసగును యేసునందుకలదీ ఆశీర్వాదం
4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించె తన రక్తముతో విమోచించి - క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె
5. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్థ్యముగా మనల జేసెను