పల్లవి:పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై (2) పూజనీయుడేసు ప్రభు (1)
1. నీ స్వకీయులే నిందించిన - నీన్నంగీకరించక పోయిన (2) ఎన్నో బాధ లొందితివా నాకై - సన్నుతింతును నీ ప్రేమకై (1)
2. సత్యము మార్గము మరి జీవమై - నిత్యజీవమియ్యను వచ్చితివి వంచకుడవ నిన్ను నిందించిర - ఓ దయామయ నజరేయుడ
3. యూదా గోత్రపు ఓ సింహమా - ఆద్యంతరహిత దైవమా అధములు నిన్ను సమరయు డనిర - థుడా నిన్ను బహు దూషించిరా
4. దూషించు శత్రుసమూహములన్ - దీవించి ఎంతో క్షమించితివి దూషకుడవని నిన్ను దూషించిర - దోషరహితుడా నా యేసు ప్రభు
5. దయ్యములు నినుజూచి వణికినను - దయ్యముల పారద్రోలినను దయ్యములు పట్టిన వాడనిర - ఓ దయామయ నా యేసు ప్రభు
6. మధురం నీ నామం అతి మధురం - మధుర గీతముతో నిన్నా రాధింతును వధియించబడితివ యీ పాపికై - వందితా ప్రభు నిన్ను పూజింతును