పల్లవి:నే పాడెద నిత్యము పాడెద (2)ప్రభువా నీకు స్తుతి పాడెదన్ (2)నే పాడెద నిత్యము పాడెద - నే పాడెద (1)
1. మంచి కాపరి నీవైతివి - గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి (2) పాపపు పాత్రను నీవే త్రాగితివి - రక్షణ పాత్రను నా కొసగితివి (2) హర్షించి ప్రభు పాడెదను (1)
2. గొప్ప కాపరివి తోడై యున్నావు - ప్రతి అవసరతన్ తీర్చుచున్నావు నా ప్రాణమునకు సేదనుదీర్చి - మరణలోయలలో తోడై యుందువు యాత్రలో పాడుచు వెళ్ళెదను
3. ఆత్మల కాపరి సత్యవంతుడవు - గొర్రెలన్నిటికి కాపరి నీవై ద్వేషించెదవు దొంగకాపరులన్ - నీగొర్రెలు నీస్వరమును వినును హృదయపూర్తిగ పాడెదను
4. ప్రధానకాపరి ప్రేమమయుడవు - త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు మహిమకిరీటము నాకొసగెదవు - పరమనగరమందు నన్నుంచెదవు ఎలుగెత్తి ప్రభు పాడెదను